ఎయిర్‌బ్యాగ్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం మహీంద్రా ఎక్స్‌యూవీ500 రీకాల్
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 వాహనం మరోసారి రీకాల్‌కు గురయ్యింది. ఈ మోడల్‌లో ఎయిర్‌బ్యాగ్స్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు గాను కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.
జులై 2014కు ముందు ఉత్పత్తి చేసిన ఎక్స్‌యూవీ500 మోడళ్లను మాత్రమే మహీంద్రా రీకాల్ చేస్తోంది. సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు గాను ఈ రీకాల్‌ను ప్రకటిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. అయితే, ఎన్ని యూనిట్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాలను వినియోగించే కస్టమర్లకు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఉచితంగా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమేనని, కారులోపల ఎలాంటి భాగాలను మార్చాల్సిన అవసరం లేదని మహీంద్రా వివరించింది.
ఈ రీకాల్‍కు సంబంధించి తాము తమ కస్టమర్లను సంప్రదిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీరు కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, ఈ లింకుపై క్లిక్ చేసి మీ వాహన సీరియల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి మీ వాహనం రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








