మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను నేడు (జూన్ 05, 2014) మార్కెట్లో విడుదల చేసింది. 'మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్' (Mahindra XUV500 Sportz) పేరిట విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్ కేవలం 1000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ ధర రూ.13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. పేరుకు తగినట్లుగానే ఇది రెగ్యులర్ ఎక్స్‌యూవీ500తో పోల్చుకుంటే మరింత స్పోర్టీగా ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త వీల్స్ వంటి కాస్మోటిక్ మార్పులతో పాటుగా అనేక అదనపు ఫీచర్లను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఆ వివరాలంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను రెగ్యులర్ ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇందులో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి 2.2 లీటర్ 140 బిహెచ్‌పి ఎమ్‌హాక్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. డబ్ల్యూ8 (టాప్-ఎండ్) వేరియంట్లో లభించే ఫీచర్లకు అధనంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో మరిన్ని ఆదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. వాటిని తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

కొత్త బాడీ గ్రాఫిక్స్

కొత్త బాడీ గ్రాఫిక్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కొత్త బాడీ గ్రాఫిక్స్ (బాడీ డెకాల్స్)తో లభిస్తుంది. ఎస్‌యూవీ సైడ్స్‌లో డోర్స్ క్రింది భాగం వద్ద 'Sportz' అనే స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌ను ఇందులో చూడొచ్చు. అలాగే, కారు బానెట్‌పై, రూఫ్‌పై కూడా స్పెషల్ గ్రాఫిక్స్ ఉంటాయి.

కొత్త అల్లాయ్ వీల్స్

కొత్త అల్లాయ్ వీల్స్

ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్‌లో విశిష్టమైన అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను చూడొచ్చు. ఈ వీల్స్ సిగ్నేచర్ రెడ్ ఇన్‌సెర్ట్స్‌తో డిజైన్ చేయబడ్డాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ అప్పీల్‌నిస్తాయి.

రియర్ వ్యూ కెమెరా

రియర్ వ్యూ కెమెరా

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ రియర్ వ్యూ కెమెరా ఆప్షన్‌తో లభిస్తుంది. దీని సాయంతో కారును రివర్స్ చేసేటం మరియు రివర్స్ పార్కింగ్ చేయటం మరింత సులువుగా మారుతుంది.

స్పోర్టీ లెథర్ సీట్స్

స్పోర్టీ లెథర్ సీట్స్

ప్రీమియం లెథర్ మరియు విలాసవంతమైన ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారు చేయబడిన సీట్స్ ఈ ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌నిస్తాయి. సెకండ్ రో సీట్లో ఏర్పాటు చేసిన ఆర్మ్ రెస్ట్ (విత్ కప్ హోల్డర్స్) ఇందులో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

స్పెషల్ ఫాగ్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్

స్పెషల్ ఫాగ్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్

సిగ్నేచర్ రెడ్ ఇన్‌సెర్ట్స్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కారుకు మరింత అందాన్నిస్తాయి. అలాగే బయటి డోర్ హ్యాండిల్స్ కూడా రెడ్ ఇన్‌సెర్ట్స్‌తో లభిస్తాయి. ఇవి కూడా లుక్‌ను పెంచేందుకు దోహదపడుతాయి.

స్టయిలిష్ రూఫ్ రెయిల్స్

స్టయిలిష్ రూఫ్ రెయిల్స్

రెడ్ కలర్‌లో ఉండే రూఫ్ రెయిల్స్, రూఫ్‌పై కొత్తగా డిజైన్ చేసిన స్పెషల్ గ్రాఫిక్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్‌లో మరో ప్రత్యేకత.

వెనుక వైపు స్పోర్ట్ బ్యాడ్జింగ్

వెనుక వైపు స్పోర్ట్ బ్యాడ్జింగ్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ వెనుక వైపు ఇదొక స్పెషల్ ఎడిషన్ అని గుర్తు చేసేందుకు వెనుక వైపు ఎక్స్‌యూవీ500 బ్యాడ్జ్ క్రింది భాగంలో క్లాసీ స్పోర్ట్స్ అనే డోమ్ బ్యాడ్జ్‌ను అంటించారు.

1000 యూనిట్లు మాత్రమే

1000 యూనిట్లు మాత్రమే

ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ కేవలం 1000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దేశీయ విపణిలో దీని ధర రూ.13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 5, 2014, 19:26 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. (M&M), India’s leading SUV manufacturer, today announced the launch of the limited edition ‘XUV500 Sportz’ built on its W8 model. Priced at Rs. 13.68 Lacs (Ex-showroom Mumbai), the ‘XUV500 Sportz’ stands out and comes packed with premium features and plush interiors.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+