మహీంద్రా ఎక్స్‌యూవీ500 వేరియంట్స్ ఇప్పుడు కొత్త కలర్లలో..

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పవర్‌ఫుల్ 'ఎక్స్‌యూవీ500'లో కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను చేర్చింది. మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 వేరియంట్లో 'శాటిన్ వైట్' అనే కొత్త కలర్‌ను అలాగే ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్లో 'డాల్ఫిన్ గ్రే' అనే కొత్త కలర్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 ఇది వరకు కేవలం మూన్‌డస్ట్ సిల్వర్, వొల్కానో బ్లాక్ కలర్లలో మాత్రమే లభ్యమయ్యేది. తాజాగా ఇందులో డాల్ఫిన్ గ్రే కలర్‌ను జోడించడంతో, డబ్ల్యూ4 వేరియంట్ కలర్ ఆప్షన్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే, ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్లో మాత్రం 'శాటిన్ వైట్' కలర్ అందుబాటులో లేదు.

Mahindra XUV500 Variants Gets Two New Colour Options

కాగా.. మిడ్ వేరియంట్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 ఇది వరకు మూన్‌డస్ట్ సిల్వర్, టస్కాన్ రెడ్, వొల్కానో బ్లాక్ మరియు డాల్ఫిన్ గ్రే కలర్లలో మాత్రమే లభ్యమయ్యేది. తాజాగా ఇందులో శాటిన్ వైట్ కలర్‌ను జోడించడంతో, డబ్ల్యూ6 వేరియంట్ కలర్ ఆప్షన్ల సంఖ్య ఐదుకుకు చేరుకుంది. అయితే వేరియంట్లో ఆర్కిట్ బ్లూ, ఓప్యులెంట్ పర్పల్ కలర్‌లు అందుబాటులో లేవు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 మరియు డబ్ల్యూ6 వేరియంట్లో ఈ రెండు కొత్త కలర్ల చేరిక మినహా ఇందులో డిజైన్ పరంగా, ఇంజన్ పరంగా, ఫీచర్స్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. అన్ని వేరియంట్ల ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లను పొ ఫొటోలో చూడవచ్చు (అందులో D అంటే డ్యూయెల్ టోన్ మరియు L అంటే లైట్ డ్యూయెల్ టోన్ అని అర్థం).

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2014, 18:01 [IST]
English summary
Mahindra has added new colour options to its flagship SUV Mahindra XUV500 variants. Now the XUV500 W6 variant gets gets the Satin White colour option and the XUV500 W4 variant gets new Dolphin Grey colour option.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+