మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 ధర రూ.10.99 లక్షలు!?
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో ఓ చవక వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గతంలో పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 (Mahindra XUV500 W4) అనే పేరుతో రానున్న ఈ కొత్త వేరియంట్ దీపావళికి ముందే మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
అంతేకాదండోయ్.. కేవలం 10.99 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మహీంద్రా అండ్ మహీంద్రా ఈ చవక వేరియంట్‌ను ఆఫర్ చేయనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500లో డబ్ల్యూ6, డబ్ల్యూ8 అనే వేరియంట్లను మాత్రమే విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.12 లక్షలకు పైమాటే. కొత్తగా వచ్చిన నిస్సాన్ టెర్రానోను సవాల్ చేసే విధంగా మహీంద్రా రూ.11 లక్షల రేంజ్‌లో తమ పాపులర్ ఎస్‌యూవీని ఆఫర్ చేయనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్లో లభించే మరియు లభించని ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి..!

లభించని ఫీచర్లు ఉండవు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ కార్నరింగ్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఓవిఆర్ఎమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, టైర్ ప్రెజర్ మోనిటర్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు కోల్పోనుంది.

లభించే ఫీచర్లు
ఇందులో బేసిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డివిడి ప్లేయర్‌కు బదులు సిడి ప్లేయర్, ఫోర్ స్పీకర్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, 6-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రిమోట్ లాకింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి పార్కింగ్ ల్యాంప్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డిస్క్ బ్రేక్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

యాంత్రికపరమైన మార్పులు లేవు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4లో యాంత్రికపరమైన మార్పులు ఉండబోవు. ఇందులో 2.2 లీచర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా కూడా ఇందులో పెద్ద మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.

కాంపిటీషన్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తాజాగా వచ్చిన రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్ల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఎంట్రీ లెవల్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








