మహీంద్రా XUV500 W4 విడుదల; ధర రూ.10.83 లక్షలు

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో ఓ చవక వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గతంలో వివిధ కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. చడిచప్పుడు లేకుండా, తమ ఎంట్రీ-లెవల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 (Mahindra XUV500 W4) వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

దేశీయ విపణిలో ఈ ఎంట్రీ-లెవల్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ధర కేవలం 10.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) మాత్రమే. ఈ కొత్త వేరియంట్‌లో డిజైన్ పరంగా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి వెర్షన్‌లలో ఉపయోగించిన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500లో డబ్ల్యూ6, డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ8 ఏడబ్ల్యూడి అనే వేరియంట్లను ఆఫర్ చేస్తుండగా, తాజాగా వచ్చిన డబ్ల్యూ4 వేరియంట్ మొత్తం వేరియంట్ల సంఖ్య 4కు చేరుకుంది. ఈ ఎంట్రీ-లెవల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్లో లభించే ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి..!

మహీంద్రా XUV500 W4 విడుదల

మహీంద్రా XUV500 W4 విడుదల

స్టాండర్డ్ కిట్‌లో భాగంగా, ఇందులో ఎల్ఈడిలతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆల్ డిస్క్ బ్రేక్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ వింగ్ మిర్రర్స్, రిమోట్ లాకింగ్, 6-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్ మరియు ఫోల్డబల్ సెకండ్ అండ్ థర్డ్ రో సీట్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

నో మెకానికలర్ ఛేంజెస్

నో మెకానికలర్ ఛేంజెస్

ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4లో యాంత్రికపరమైన మార్పులు ఉండబోవు. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

లభించని ఫీచర్లు ఉండవు

లభించని ఫీచర్లు ఉండవు

ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 వేరియంట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ కార్నరింగ్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, టైర్ ప్రెజర్ మోనిటర్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఈ వేరియంట్లో లేవు.

కాంపిటీషన్

కాంపిటీషన్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తాజాగా వచ్చిన రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, నిస్సాన్ టెర్రానో వంటి మోడళ్ల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఎంట్రీ లెవల్ ఎక్స్‌యూవీ500 ఎస్‌‌యూవీని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

ఎక్స్‌యూవీ500 - వేరియంట్లు ధరలు

ఎక్స్‌యూవీ500 - వేరియంట్లు ధరలు

  • ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4 - రూ.10.83 లక్షలు
  • ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 - రూ.11.90 లక్షలు
  • ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఎఫ్‌డబ్ల్యూడి) - రూ.13.49 లక్షలు
  • ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఏడబ్ల్యూడి) - రూ.14.55 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Wednesday, November 6, 2013, 15:11 [IST]
English summary
Remember the new low cost base variant of the Mahindra XUV500 which the automaker confirmed earlier this year and now the carmaker has launched the XUV500 W4 at Rs 10.83 lakh (ex-showroom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+