మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్: అదనపు ఫీచర్లు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500లో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. 'మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్' పేరిట విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ప్రధానంగా.. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో లభ్యం కానుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో సన్‌రూఫ్‌ని పరిచయం చేయటం ఇదే ప్రప్రథమం. కంపెనీ అందిస్తున్న ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని అదనపు ఫీచర్లతో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను తయారు చేశారు.
దేశీయ విపణిలో ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎస్‌యూవీలో లభ్యం కానున్న ఇతర ఫీచర్లు, ధరల వివరాలను తెలుసుకుందాం రండి..!

700 యూనిట్లు మాత్రమే
కేవలం 700 యూనిట్ల ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లను మాత్రమే మహీంద్రా ఉత్పత్తి చేయనుంది.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో లభ్యం కానుంది. ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే లభించే ఈ తరహా ఫీచర్‌ను తొలిసారిగా ఎక్స్‌యూవీ500లో ఆఫర్ చేస్తున్నారు. ఇది స్మార్ట్ యాంటీ-పించ్ మెకానిజంను కలిగి ఉంటుంది.

స్పోర్టీ అల్యూమినియం పెడల్స్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో స్పోర్టీ అల్యూమినియం పెడల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. వీటి వలన పెడల్స్ పైనుంచి కాలు జారిపోయే ప్రమాదం ఉండదు.

ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్ల్
ఇంటీరియర్ లుక్‌ని మరింత పెంచేందుకు గాను మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో ప్రకాశించే స్కఫ్ ప్లేట్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఎలక్ట్రికల్లీ అడ్జస్టల్ డ్రైవర్ సీట్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో డ్రైవర్ సీటును యాంత్రికంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందులో డ్రైవర్ సీటును 6 రకాలుగా యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

స్టయిలిష్ గ్రే అల్లాయ్ వీల్స్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో స్టయిలిష్ గ్రే అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కారు ఎక్స్టీరియర్ అందాన్ని మరింత పెంచుతుంది.

ఎక్స్‌క్లూజివ్ బ్యాడ్జ్
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను ప్రత్యేకతను గుర్తు చేసేలా ఎస్‌యూవీ వెనుక భాగంలో ఎక్స్‌క్లూజివ్ బ్యాడ్జ్‌ని తగలించారు.

రివర్సింగ్ కెమెరా
చివరిగా ఇందులో రివర్స్ పార్కింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. అన్నివేళల్లోను సురక్షితంగా కారును రివర్స్ చేయటంలో ఈ ఫీచర్ సహకరిస్తుంది.

ధర
భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ధర రూ.14.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.


Click it and Unblock the Notifications








