హైదరాబాద్‌లో 9 సీటర్ మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ విడుదల
హైదరాబాద్: ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన 9-సీటర్ వెర్షన్ 'మహీంద్రా జైలో డి2 మ్యాక్స్' (Mahindra Xylo D2 MAXX)ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తొమ్మిది మంది ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) కూర్చొని ప్రయాణించేలా ఈ కొత్త జైలో డి2 డిమ్యాక్స్‌ను తయారు చేశారు.
రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ ఎమ్‍పివి ధరను రూ.7.33 లక్షలు (బిఎస్3 వెర్షన్, ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ 9-సీటర్ ఎమ్‌పిని ప్రధానంగా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్, ప్యాసింజర్ మూవ్‌మెంట్ కోసం అభివృద్ధి చేశామని, ఇందులో సైడ్ ఫేసింగ్ రియర్ సీట్స్ (వెనుక వరుసలో ఎదురెదురుగా ఉండే సీట్లు) ఉంటాయని కంపెనీ వివరించింది.

మహీంద్రా జైలో డి2 మ్యాక్స్‌లో 2.5 లీటర్ ఎమ్‌డిఐ సిఆర్‌డిఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్3, బిఎస్4 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 14.95 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








