మొట్టమొదటి సారిగా నెం.1 స్థానాన్ని కోల్పోయిన మారుతి ఆల్టో

By Ravi

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి ఆల్టో ఇప్పుడు తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. టాప్ 10 కార్లలో నెంబర్ వన్‌గా ఉండే ఆల్టో ఇప్పుడు నెంబర్ 3కి పడిపోయింది. మారుతి ఆల్టో ధర కన్నా రెట్టింపు ఉన్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఆల్టో స్థానాన్ని కైవసం చేసుంది.

గడచిన నెలలో (మే 2014లో) కేవలం 17,311 మారుతి ఆల్టో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో స్విఫ్ట్ డిజైర్ సెడాన్ 18,953 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉండగా, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 17,936 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లు మొట్టమొదటి సారిగా ఆల్టో కారును మూడవ స్థానంలోకి నెట్టేశాయి.

Maruti Alto

దాదాపు రెండు దశాబ్ధాలుగా భారతదేశపు ఫేవరేట్ కారుగా, మధ్యతరగతి ప్రజల కలల కారుగా ఉన్న ఆల్టో క్రమంగా తన హవాను కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. కస్టమర్లు కూడా బోరింగ్ ఆల్టో డిజైన్ పట్ల విసుగు చెంది, మరింత స్టయిలిష్‌గా కనిపించే ఇతర మోడళ్లపై దృష్టి సారిస్తుండటం కూడా ఆల్టో అమ్మకాలు తగ్గటానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.

ఆల్టో కారును కొనాలనుకునే కస్టమర్లలో చాలా మంది ఇటీవల విడుదలైన సెలెరియోపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు ఈ సెగ్మెంట్లో డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కారును ప్రవేశపెట్టం, హ్యుందాయ్ మరింత పవర్‌ఫుల్ ఇయాన్‌ని విడుదల చేయటం వంటి పలు మార్కెట్ పరిస్థితులు కూడా ఆల్టో అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతున్నట్లు అర్థమవుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 11, 2014, 14:50 [IST]
English summary
Maruti Alto is no more India's largest selling car and it has been relegated to the third spot, with none other than the Swift DZire.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+