భారత సైన్యం నుంచి 4,200 మారుతి జిప్సీలకు ఆర్డర్
ఎస్‌యూవీ ప్రియులకు మారుతి జిప్సీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా ఈ సెగ్మెంట్లో ఓ వెలుగు వెలిగిన మారుతి జిప్సీ ఇప్పుడు ఆర్మీ వాహనంగా సేవలు అందిస్తున్న సంగతి తెలిసినదే. భారత సైన్యం ఇప్పటికే 31,000 యూనిట్లకు పైగా ఈ ఎస్‌యూవీలను కొనుగోలు చేసింది. తాజాగా మరో 4,100 యూనిట్ల జిప్సీల కోసం సైన్యం ఆర్డర్ చేసింది.
కేంద్రప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ద్వారా మారుతి సుజుకి ఇండియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే జిప్సీ వాహనాలను సైన్యానికి ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. కాగా.. ఈ డీల్‌కి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మారుతి తమ జిప్సీ ఎస్‌యూవీని తొలిసారిగా 1985లో విడుదల చేసింది.
భారత సైన్యం 1991లో జిప్సీ వాహనాల కోసం మొట్టమొదటి ఆర్డర్‌ను ప్లేస్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 31,000 యూనిట్లకు పైగా జిప్సీ వాహనాలను సైన్యం కొనుగోలు చేసింది. ఉత్తమ ఆఫర్ రోడింగ్ పెర్ఫార్మెన్స్ కలిగిన ఈ కాంపాక్ట్ అండ్ స్టైలిష్ ఎస్‌యూవీ సైన్యం సంచరించే సరిహద్దు ప్రాంతాల్లో సేవలందించేందుకు చక్కగా ఉపయోగపడుతోంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మారుతి జిప్సీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

మారుతి జిప్సీ పెట్రోల్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇది 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

మారుతి జిప్సీలో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 80 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 103 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

రెగ్యులర్ కస్టమర్లు కొనుగోలు చేసే మారుతి జిప్సీకి, సైన్యం కొనుగోలు చేసే జిప్సీకి అనేక వ్యత్యాసాలు ఉంటాయి.

ఆర్మీ వెర్షన్ మారుతి జిప్సీ మంచి ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, సమర్థవంతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కొండలు, అడవులు వంటి ప్రాంతాల్లో రవాణాకు చక్కగా సరిపోతుంది.

అంతేకాకుండా.. ఆర్మీ వెర్షన్ జిప్సీలలో యుద్ధ పరిస్థితుల్లో బ్లాక్-అవుట్ సమయాన్ని ఫాలో అయ్యేందుకు ఆకుపచ్చ కాంతిని విడుదల చేసే కాన్వాయ్ లైట్స్, మిలటరీ పరికాలను లాగేందుకు ధృఢమైన హుక్స్, పెద్ద పెద్ద గన్స్, వెపన్స్‌ను ఫిక్స్ చేసుకునేందుకు అసరమైన ఏర్పాట్లు ఉంటాయి.

మారుతి జిప్సీ వాహనాలను కేవలం సైన్యమే కాకుండా, వైమానికదళం, నావీదళం, పారామిలటరీ బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలు కూడా ఉపయోగిస్తుంటాయి. అయితే, వీటి సంఖ్య ఆర్మీతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం కస్టమర్లు ఆర్డర్ మేరకు తమ జిప్సీ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎస్‌యూవీని కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

మారుతి జిప్సీ ఎస్‌యూవీలను ఎక్కువగా మోటార్‌స్పోర్ట్స్ ర్యాలీలలో ఉపయోగిస్తుంటారు. అందుకే, ర్యాలీ డ్రైవర్ల నుంచి ఈ మోడల్ కోసం ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి.


Click it and Unblock the Notifications








