8 నెలలకు పెరిగిన సెలెరియో ఏఎమ్‌టి వెయిటింగ్ పీరియడ్!

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న లేటెస్ట్ స్మాల్ కార్ 'సెలెరియో'కి మార్కెట్లో క్రేజ్ నానాటికీ పెరుగుతోంది. ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, మోడ్రన్ ఫీచర్లు, సరసమైన ధర మరియు ఉత్తమ మైలేజ్ వంటి పలు అంశాలతో ఇది కొనుగోలుదారులను తొలిచూపులోనే ఆకట్టుకుంటోంది. ఫలితంగా, ఈ మోడల్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి సెలెరియో వెయిటింగ్ పీరియడ్ కూడా మునుపటి కన్నా అధికమైంది. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న సెలెరియో అతికొద్ది సమయంలో అత్యధిక పాపులరాటీని దక్కించుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో కన్నా ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కలిగిన సెలెరియోకే ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయి.

Maruti Celerio AMT

అంతేకాదు, భారతదేశంలోనే తొలిసారిగా మ్యాన్యువల్ వేరియంట్ అమ్మకాలను ఆటోమేటిక్ వేరియంట్ అమ్మకాలు అధిమించడం కూడా ఇదే మొట్టమొదటిసారి. దీంతో మారుతి సుజుకి సెలెరియో ఏఎమ్‌టి వెయిటింగ్ పీరియడ్ ఇదివరకు ఆరు నెలలుగా ఉంటే, ఇప్పుడది 7-8 నెలలకు పెరిగిపోయింది. అంటే, మే 2014 నెలలో సెలెరియోను బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ డెలివరీ లభించే అవకాశం ఉందన్నమాట.

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది లీటరుకు 23.1 కి.మీ. మైలేజీనిస్తుంది (మ్యాన్యువల్/ఏఎమ్‌టి).

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2014, 9:20 [IST]
English summary
Maruti Suzuki Celerio AMT waiting period has gone up by 7-8 months, earlier it was 6 months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+