మారుతి సెలెరియో సూపర్ హిట్: రోజుకి 1000 బుకింగ్స్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) అనతి కాలంలోనే మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. ఈ కారుకు ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000 యూనిట్ల వరకు బుకింగ్‌లు వస్తున్నాయని, ఈ స్పందన తమకెంతో సంతోషానిస్తుందని కంపెనీ చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు.

స్టయిలిష్ డిజైన్, నాణ్యమైన ఇంటీరియర్స్, మెరుగైన మైలేజ్ వంటి అనేక అంశాలతో పాటుగా ప్యాసింజర్ కార్లలో కెల్లా మొట్టమొదటి సారిగా ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారును కొనుగోలుదారులు చక్కగా ఆదరిస్తున్నారు. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానంగా మైలేజీనివ్వగలగటం (23.1 కెఎమ్‌పిఎల్) ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ యొక్క ముఖ్య విశిష్టత.

Maruti Celerio Bookings Clock 1000 Units Per Day

ఇదిలా ఉండగా.. భారత ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, మారుతి సుజుకి తమ సెలెరియో కారు ధరను కూడా భారీగా తగ్గించింది. తాజా తగ్గింపు తర్వాత మారుతి సుజుకి సెలెరియో బేస్ వేరియంట్ కేవలం రూ.3.76 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.3.90 లక్షలుగా ఉండేది).

టాప్ ఎండ్ వేరియంట్ సెలెరియో (జెడ్ఎక్స్ఐ ఆప్షనల్) రూ.4.79 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.4.96 లక్షలుగా ఉండేది). ఇకపోతే, ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో కూడిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.4.14 లక్షలు గాను మరియు విఎక్స్ఐ వేరియంట్ రూ.4.43 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, February 21, 2014, 18:16 [IST]
English summary
Maruti Suzuki's newly launched Celerio hatchback is registering 1,000 bookings per day. The Celerio was launched at the Auto Expo on February 6 and comes with the Automatic Manual Transmission (AMT), a technology introduced for the first time in the mass segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+