థాయ్‌లాండ్‌లో మారుతి సుజుకి సెలెరియో ఉత్పత్తి!
గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే థాయ్‌లాండ్‌లో కూడా ఉత్పత్తి కానుంది. థాయ్‌లాండ్‌లోని రేయాంగ్ ప్లాంట్‌లో సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను ఉత్పత్తి చేయనున్నారు. దీంతో భారత్ తర్వాత సెలెరియోని ఉత్పత్తి చేయనున్న రెండవ దేశంగా థాయ్‌లాండ్ నిలువనుంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల
థాయ్‌లాండ్‌లోని రేయాంగ్ ప్లాంటులో ఉత్పత్తి చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను యూరప్ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. వాస్తవానికి ఇండియాలో తయారైన సెలెరియోనే యూరప్ మార్కెట్లకు ఎగుమతి చేయాల్సి ఉన్నప్పటికీ, దాని కాలుష్య నిబంధనలు యూరప్ మార్కెట్లకు అనుగుణంగా లేని కారణంగా, ఈ కారును థాయ్‌లాండ్‌లో ఉత్పత్తి చేయాల్సి వచ్చింది.

భారత్‌లో తయారవుతున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కేవలం యూరో 4 నిబంధనలను మాత్రమే పాటిస్తుంది. ఈ నిబంధనలు పాటించే వాహనాలకు యూకే మార్కెట్లో అనుమతి ఉండదు. కనీసం యూరో 5 నిబంధనలు పాటించే వాహనాలకు యూకే మార్కెట్లో అనుమతి ఉంటుంది. ఈ రేయాంగ్ ప్లాంటులో ఉత్పత్తయ్యే అన్ని వాహనాలు యూరో 5 నిబంధనలు పాటిస్తాయి.
యూరోపియన్ స్పెసిఫిక్ సెలెరియో కారులో, ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ సెలెరియోలో ఉపయోగిస్తున్న కె10బి ఇంజన్‌కు కె10సి ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో పాటుగా కాలుష్యాన్ని తగ్గించే మరో ఫీచర్‌ను జోడించనున్నారు (ఇండియన్ వెర్షన్ సెలెరియో కారులో ఈ రెండు ఫీచర్లు లేవు).
మే 2014 నెల నుంచి థాయ్‌లాండ్‌లో సెలెరియో ఉత్పత్తి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఇవి అక్కడి నుంచి యూరప్ మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఆస్కారం ఉంది. అయితే, యూరోపియన్ వెర్షన్ సెలెరియో ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుందా లేక రెగ్యులర్ సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో లభిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








