సెప్టెంబర్ 2014లో మారుతి సుజుకి సియాజ్ విడుదల

By Ravi

ఈ నెల ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఆవిష్కరించిన 'సియాజ్' (Ciaz) సెడాన్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం మారుతి దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'కు రీప్లేస్డ్ వెర్షన్‌గా ఈ కొత్త సియాజ్ సెడాన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను మోడ్రన్‌గా డిజైన్ చేసింది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది.

మారుతి సుజుకి సియాజ్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మారుతి సుజుకి సియాజ్

వాస్తవానికి ఇది ఎస్ఎక్స్‌4 సెడాన్ రీప్లేస్‌మెంట్ మోడల్ అయినప్పటికీ, పాత ఎస్ఎక్స్4 సెడాన్‌కు ఈ కొత్త సియాజ్ సెడాన్‌కు మధ్య ఎలాంటి పోలిక ఉండదు. కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి డిజైన్ మార్పులను ఈ మారుతి సియాజ్ సెడాన్‌లో గమనించవచ్చు.

మారుతి సుజుకి సియాజ్

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. నాణ్యమైన ఇంటీరియర్స్, సుపీరియర్ ఫిట్ అండ్ ఫినిష్‌లను ఇందులో గమనించవచ్చు. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సియాజ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, శాటిలైట్ నావిగేషన్, రియర్ ఎయిర్ కండిషనింగ్, హై-ఎండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఫీచర్లను ఆఫర్ చేయవచ్చని అంచనా.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సియాజ్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న ఇంజన్ ఆప్షన్ల గురించి ప్రస్తుతానికి స్పష్టమైన అవగాహన లేనప్పటికీ, ఇందులో 1.4 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్లతో పాటుగా సుజుకి స్వతహాగా అభివృద్ధి చేస్తున్న కొత్త ఇంజన్‌ను కూడా ఉపయోగించవచ్చని సమాచారం.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ పెట్రోల్ వెర్షన్‌లో రెగ్యులర్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా కంపెనీ ఇటీవలే సెలెరియోలో పరిచయం చేసిన ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని కూడా ఇందులో ఉపయోగించవచ్చని పరిశ్రమ వర్గాల సమాచారం. మరిన్ని వివరాలు తెలియాంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 26, 2014, 15:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+