ఎస్ఎక్స్4 ఉత్పత్తి బంద్; మరికొద్ది రోజుల్లో సియాజ్ లాంచ్
మారుతి సుజుకి అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4' ఉత్పత్తిని కంపెనీ అధికారికంగా నిలిపివేసింది. ఈ మోడల్‌ను రీప్లేస్ చేస్తూ మారుతి సుజుకి ఇండియా మరికొద్ది రోజుల్లో తమ సరికొత్త సియాజ్ (Ciaz) సెడాన్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ఎక్స్4 స్టాక్ క్లియర్ కాగానే కొత్త సియాజ్ మార్కెట్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: మారుతి సుజుకి సియాజ్ డిటేల్స్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తొలిసారిగా తమ 'సియాజ్' (Ciaz) సెడాన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ పండుగ సీజన్‌లో మారుతి తమ సియాజ్‌ను కస్టమర్లకు పరిచయం చేయనుంది.

మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నప్పటికీ, ఈ సెగ్మెంట్లో కొత్త వచ్చిన 2014 హోండా సిటీ, ఫ్లూయిడిక్ హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్ల కారణంగా దీని అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఎస్ఎక్స్4ను తొలిసారిగా 2007వ సంవత్సరంలో 1.6 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌తో భారత విపణిలో విడుదల చేశారు. ఆ తర్వాత కంపెనీ అదే ఇంజన్‌ను వివిటి (వేరియబల్ వాల్వ్ టైమింగ్)తో అప్‌డేట్ చేసి ఇంజన్ పవర్‌ను 105 పిఎస్‌లకు పెంచింది.
ఇది కూడా చదవండి: మారుతి ఆల్టో 800 స్పెషల్ ఎడిషన్ విడుదల
మారుతి 2010లో ఎస్ఎక్స్4లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత 2011లో ఎస్ఎక్స్4లో కంపెనీ డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 1.3 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్, 90 పిఎస్ పవర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యేది.

ఇక మారుతి విడుదల చేయనున్న సియాజ్ సెడాన్ విషయానికి వస్తే.. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను మోడ్రన్‌గా డిజైన్ చేసింది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేశారు.
ఇది కూడా చదవండి: మారుతి సెలెరియో వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు
వాస్తవానికి ఇది ఎస్ఎక్స్4 సెడాన్ రీప్లేస్‌మెంట్ మోడల్ అయినప్పటికీ, పాత ఎస్ఎక్స్4 సెడాన్‌కు ఈ కొత్త సియాజ్ సెడాన్‌కు మధ్య ఎలాంటి పోలిక ఉండదు. కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి డిజైన్ మార్పులను ఈ కారులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్స్ మరియు టెక్నాలజీ ఫీచర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇంజన్ ఆప్షన్స్ గురించి మాత్రం ఇంకా స్పష్టమైన సమచారం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








