మారుతి సుజుకి ఆల్టో 800 యానివర్స్‌రే ఎడిషన్ విడుదల
మారుతి సుజుకి అందిస్తున్న ఆల్టో 800 కారును భారత మార్కెట్లో విడుదల చేసి అప్పుడే ఒక ఏడాది పూర్తయిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను మార్కెటలో విడుదల చేసింది. రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే, యానివర్స్‌రే వెర్షన్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు లభ్యం కానున్నాయి.
యానివర్స్‌రే ఎడిషన్ ఆల్టో 800 కారు 'పర్పల్ హేజ్' బాడీ కలర్‌లో, కొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త యానివర్స్‌రే ఎడిషన్‌ను అభివృద్ధి చేశారు. యానివర్స్‌రే ఎడిషన్ ఆల్టో 800 కారులో లభించే అధనపు ఫీచర్లు మరియు దీని ధర క్రింది విధంగా ఉంది:

- ప్రత్యేకమైన పర్పల్ హేజ్ బాడీ కలర్ స్కీమ్
- ఆకర్షనీయమైన యానివర్స్‌రే బాడీ గ్రాఫిక్స్
- కొత్త సీట్ కవర్ ఫ్యాబ్రిక్స్
- బ్లాక్ కలర్ బి-పిల్లర్
- కారుకు ఇరువైపులా స్క్రాచ్ గార్డ్స్
- రియర్ పార్సిల్ ట్రే
- బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్
- ఆప్షనల్ ఆడియో సిస్టమ్
- ధర రూ.3.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
యానివర్స్‌రే ఎడిషన్ ఆల్టో 800 కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 796సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 46 హెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 22 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








