జనవరి 2015లో మారుతి ఆల్టో కె10 ఏఎమ్‌టి లాంచ్: రూమర్
భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉన్న మారుతి సుజుకి ఆల్టో మోడల్‌కు ఇప్పుడు డాట్సన్ గో మరియు ఇటీవలే విడుదలైన హ్యుందాయ్ ఇయాన్ 1.0 మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదరవుతోంది. ఈ పోటీ ఫలితంగా ఆల్టో బ్రాండ్ కొందరు పటిష్టమైన కొనుగోలుదారులను కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, ఆల్టో బ్రాండ్‌కి స్థిరత్వాన్ని కల్పించేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది.
అదేంటంటే.. మారుతి సుజుకి భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) సరకొత్త గేర్‌బాక్స్‌ను తమ సెలెరియో కారు ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అనుకున్న దాని కన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందటంతో, కంపెనీ అందిస్తున్న ఇతర మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.

ఇందులో భాగంగానే, మారుతి సుజుకి నుంచి అత్యంధికంగా అమ్ముడుపోతున్న 1000సీసీ ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఏఎమ్‌టి వెర్షన్లను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతా సజావుగా సాగితే జనవరి 2015 ఏఎమ్‌టి వెర్షన్ ఆల్టో కె10 మోడల్‌ను రోడ్లపై చూసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా రికార్డు సృష్టించిన ఆల్టో కారులో తాజాగా ఏఎమ్‌టి వెర్షన్‌ను కూడా జోడించినట్లయితే, ఇక ఈ మోడల్ అమ్మకాలు తిరుగుండదు. ఇదే నెంబర్ వన్ కారుగా చరిత్రను సృష్టించే అవకాశం ఉంది. మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కార్లలో ఈ అధునాతన ఏఎమ్‌టి టెక్నాలజీని పరిచయం చేయటం ద్వారా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అటు పూర్తి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లోని సౌకర్యాన్ని మరియు ఇటు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానమైన మైలేజీని ఇవ్వగలగటం ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) యొక్క ప్రధాన లక్షణం. అంతేకాదు.. సాంప్రదాయ (ఫుల్లీ) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లతో పోల్చుకుంటే, ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు అత్యంత సరమైన ధరకే లభించడం మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సమానమైన మైలేజీనివ్వటం కూడా ఏఎమ్‌టి పాపులారిటీకి కారణాలుగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








