హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

By Ravi

మారుతి సుజుకి ఇటీవలే దేశీయ విపణిలో ఆవిష్కరించిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను శుక్రవారం రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా మారుతి సుజుకి సెలెరియో కారులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీని పరిచయం చేశామని, ఇది పూర్తి ఆటోమేటిక్ కారులోని కంఫర్ట్‌ను అలాగే మ్యాన్యువల్ కారులోని మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సి.వి. రామన్ వివరించారు.

మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి వెర్షన్ మారుతి సెలెరియో కార్లు రెండూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంది. రాష్ట్ర విపణిలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన సెలెరియో ధరలు రూ.4.02 లక్షల నుంచి రూ.5.10 లక్షల రేంజ్‌లో ఉండగా, ఈజీ డ్రైవ్ ఆటో గేర్ షిఫ్ట్ కలిగిన సెలెరియో ధరలు రూ.4.43 లక్షల నుంచి రూ.4.73 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

మోడ్రన్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ స్పేస్, అధునా టెక్నాలజీ, ఈజీ డ్రైవ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్లు ఈ మారుతి సుజుకి సెలెరియో కారు ప్రత్యేకతలు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

మారుతి సెలెరియో 3600 మి.మీ. పొడవును, 1600 మి.మీ. వెడల్పును మరియు 2425 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి, కారులో విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. సెలెరియో బూట్‌స్పేస్ 235 లీటర్లు. వాస్తవానికి ఈ బూట్‌స్పేస్ స్విఫ్ట్ బూట్ స్పేస్ కన్నా అధికం.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న బ్లేజింగ్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, గ్లిస్టెనింగ్ గ్రే, సిల్కీ సిల్వర్ కలర్లతో పాటుగా, మరో మూడు ఆకర్షనీమైన రంగుల్లో లభిస్తుంది. అవి - సన్‌షైన్ రే, సెరులియన్ బ్లూ, కేవ్ బ్లాక్.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి సెలెరియో విడుదల

మారుతి సుజుకి సెలెరియో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నాలుగు వేరియంట్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుండగా, రెండు వేరియంట్లు ఈజీ డ్రైవ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, February 8, 2014, 16:58 [IST]
English summary
Maruti Suzuki India has lunched Celerio hatchback in Hyderabad after unveiling at the 2014 Auto Expo in Greater Noida. with the announcements of the prices. The Celerio becomes India's most affordable ‘automatic' car with a starting price of INR 4.43 lakhs for the EZ Drive base variant. The range itself starts at INR 4.02 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+