మారుతి సుజుకి సెలెరియో ధర తగ్గింపు

By Ravi

భారత ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది.

కంపెనీ ఇటీవలే విడుదల చేసిన సెలెరియో కారు మొదలుకొని దాదాపు అన్ని మోడళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజా తగ్గింపు తర్వాత మారుతి సుజుకి సెలెరియో బేస్ వేరియంట్ కేవలం రూ.3.76 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.3.90 లక్షలుగా ఉండేది).

Maruti Suzuki Celerio

అలాగే టాప్ ఎండ్ వేరియంట్ సెలెరియో (జెడ్ఎక్స్ఐ ఆప్షనల్) రూ.4.79 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.4.96 లక్షలుగా ఉండేది). ఇకపోతే, ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో కూడిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.4.14 లక్షలు గాను మరియు విఎక్స్ఐ వేరియంట్ రూ.4.43 లక్షలుగా ఉన్నాయి.

ధరల సవరణ అనంతరం వివిధ మోడళ్ల ధరల శ్రేణి క్రింది విధంగా ఉంది:
* మారుతి స్విఫ్ట్ - రూ.4.42 లక్షల నుంచి రూ.6.70 లక్షలు
* మారుతి స్విఫ్ట్ డిజైర్ - రూ.4.85 లక్షల నుంచి రూ.7.82 లక్షలు
* మారుతి ఆల్టో 800 - రూ.2.72 లక్షల నుంచి రూ.3.52 లక్షలు
* మారుతి ఆల్టో కె10 - రూ.3.15 లక్షల నుంచి రూ.3.31 లక్షలు
* మారుతి వ్యాగన్ఆర్ - రూ.3.48 లక్షల నుంచి రూ.4.37 లక్షలు
* మారుతి రిట్జ్ - రూ.4.23 లక్షల నుంచి రూ.6.15 లక్షలు
* మారుతి ఎర్టిగా - రూ.5.80 లక్షల నుంచి రూ.7.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2014, 16:19 [IST]
English summary
Maruti Suzuki have cut prices across all its models after Finance Minister P Chidambaram reduced excise duty on automobiles in the Interim Budget. Maruti's recently launched Celario's prices also have been slashed by 3.5-3-6 per cent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+