మారుతి సుజుకి సియాజ్ వివరాలు వెల్లడి!
మారుతి సుజుకి ఇండియా మరికొద్ది రోజుల్లోనే తమ సరికొత్త ఉత్పత్తి 'సియాజ్' (Ciaz) సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ కొత్త కారుకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడి చేసింది.
అంతేకాకుండా, మారుతి సుజుకి సియాజ్ సెడాన్ కోసం కంపెనీ డీలర్లు రేపటి నుంచే (సెప్టెంబర్ 3, 2014) రూ.21,000 అడ్వాన్సు మొత్తంతో బుకింగ్‌లను కూడా అంగీకరించనున్నారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, 7 రంగులలో లభ్యం కానుంది.
మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే ఈ కారు ఉత్పత్తిని మానేసర్ ప్లాంటులో ప్రారంభించింది. ఈ కొత్త సియాజ్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను కంపంనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. ఈ కారుకు సంబంధించి విడుదలైన సరికొత్త వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

తర్వాతి స్లైడ్‌లలో మారుతి సుజుకి సియజ్‌కు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోండి.

ఎక్స్టీరియర్స్
ఎక్స్టీరియర్స్‌లో.. ప్రధానంగా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో డిమ్మింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లున్నాయి.

ఇంటీరియర్స్
ఇంటీరియర్స్ గమనిస్తే.. ఇందులో బీజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్‌పై బ్రౌన్ ఉడెన్ ఫినిష్, ఏసి వెంట్స్ చుట్టూ క్రోమ్ గార్నిష్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లున్నాయి.

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్స్
వెనుక సీటులో కూర్చునే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్, పవర్ సాకెట్స్, వెనుక సీటులోని ప్యాసింజర్ల కోసం ట్విన్ రీడింగ్ ల్యాంప్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ బూట్ రిలీజ్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) డ్రైవర్‌సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.

పెట్రోల్ ఇంజన్, మైలేజ్
పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌లో 1.4 లీటర్ కె10బి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 91 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 20.73 కెఎమ్‌పిఎల్.

డీజిల్ ఇంజన్, మైలేజ్
డీజిల్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 26.21 కెఎమ్‌పిఎల్.


Click it and Unblock the Notifications








