మారుతి సుజుకి సెలెరియోలో సిఎన్‌జి వెర్షన్!
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి ఇటీవలే విడుదలై, మంచి సక్సె స్ సాధించిన సెలెరియో హ్యాచ్‍బ్యాక్‌లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మారుతి సుజుకి సెలెరియో కారులో ప్యాసింజర్ కార్లలోనే మొట్టమొదటి సారిగా క్లచ్ లేని ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ను ఉపయోగించిన సంగతి తెలిసినదే. ఏఎమ్‌టి పాపులారిటీతో ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ 8-9 నెలలకు పెరిగింది.

ఈ నేపథ్యంలో, తమ ఫాస్ట్ సెల్లింగ్ కారు సెలెరియోలో సిఎన్‌జి ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే, సిఎన్‌జి వేరియంట్ మారుతి సుజుకి సెలెరియో మాత్రం కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో మాత్రమే లభ్యం కానుంది.
ధరను దృష్టిలో ఉంచుకొని సిఎన్‌జి వెర్షన్ సెలెరియోలో ఆటోమేటిక్ వేరియంట్‌ను ఆఫర్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. జూన్ 2014 నెలలో సెలెరియో సిఎన్‌జి విడుదల కావచ్చని అంచనా. ఈ వేరియంట్‌లో కూడా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 68 హార్స్ పవర్‌ల శక్తిని, 90 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ రెగ్యులర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. సెలెరియోలో డీజిల్ వెర్షన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ, ముందుగా సిఎన్‌జి వెర్షన్ సెలెరియోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








