800సీసీ డీజిల్ ఇంజన్‌తో రానున్న మారుతి సుజుకి సెలెరియో
మొట్టమొదటి సారిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చి అత్యంత సక్సెస్‌ఫుల్ మారుతి సుజుకి సెలెరియో కారు త్వరలోనే డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే ఓ చిన్నసైజు డీజిల్ ఇంజన్‌ను డెవలప్ చేస్తున్న సంగతి తెలిసినదే.
కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, సెలెరియో పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి ఓ 800సీసీ డీజిల్ ఇంజన్ కలిగిన సెలిరియోను ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. వాస్తవానికి మారుతి సుజుకి ఈ 800సీసీ డీజిల్ ఇంజన్‌ను తమ తొలి ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్)లో ఉపయోగించేందుకు తయారు చేస్తోంది.

ఈ చిన్న ఇంజన్‌ను భారత మార్కెట్లోనే ఉత్పత్తి చేయనున్నారు. ఇదే ఇంజన్‌ను కొంచెం ట్యూన్ చేసి ఎంట్రీ లెనల్ ప్యాసింజర్ కార్లలో కూడా ఉపయోగించాలని మారుతి సుజుకి యోచిస్తోంది. ప్రస్తుతం గుర్గావ్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ 800సీసీ డీజిల్ ఇంజన్ కలిగిన సెలెరియో లీటరుకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వరకూ మైలేజీనివ్వగలదని అంచనా.
మారుతి సుజుకి ఇటీవలే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడిన సిఎన్‌జి వెర్షన్ సెలెరియోను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మరికొద్ది నెలల్లో డీజిల్ ధరలు పెరగనున్న నేపథ్యంలో, డీజిల్ వెర్షన్ సెలెరియోను ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకికి ఇదే సరైన సమయం.

కానీ, పెట్రోల్ వెర్షన్ సెలెరియో మాదిరిగా డీజిల్ వెర్షన్ సెలెరియోలో ఏఎమ్‌టి వెర్షన్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, మారుతి సుజుకి ఈ హై ఫ్యూయెల్ ఎఫీషియెంట్ వెహికల్‌లో ఏఎమ్‌టిని కూడా ఆఫర్ చేస్తే బాగుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
డీజిల్ వెర్షన్ సెలెరియోలో డిజైన్, ఫీచర్స్, ఇంటీరియర్స్ పరంగా ఎలాంటి అప్‌డేట్స్ ఉండకపోవచ్చు. కేవలం యాంత్రికపరమైన మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. మరి ఇందులో కూడా ఏఎమ్‌టి వస్తుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








