మారుతి సుజుకి ఎర్టిగా ధరలు, వేరియంట్ల వివరాలు
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఎర్టిగాలో ఓ కొత్త సిఎన్‌జి వేరియంట్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. ఎర్టిగా సిఎన్‌జి రెండు వేరియంట్లలో (ఎల్ఎక్స్ఐ సిఎన్‌జి, విఎక్స్ఐ సిఎన్‌జి)లో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- మారుతి సుజుకి ఎర్టిగా ఎల్ఎక్స్ఐ సిఎన్‌జి ధర - రూ.6.52 లక్షలు
- మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ సిఎన్‌జి ధర - రూ.7.30 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
సిఎన్‌జి వేరింట్ల ధర పెట్రోల్ వెర్షన్ ఎర్టిగా ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ వేరియంట్ల కన్నా వరుసగా రూ.56,000 మరియు రూ.63,000 అధికం. సిఎన్‌జి వేరియంట్ ఎర్టిగా కిలోకు 22.80 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. జులై 1, 2013 నుండి ఈ సిఎన్‌జి వేరియంట్ ఎర్టిగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications