లక్ష మార్కును దాటిన మారుతి సుజుకి ఎర్టిగా

By Ravi

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, గడచిన సంవత్సరం దేశీయ విపణిలో విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ ఎమ్‌పివీ 'మారుతి సుజుకి ఎర్టిగా' (Maruti Suzuki Ertiga) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మార్కెట్లో విడుదలైన ఏడాదిలోనే లక్షకు పైగా వినియోగదారులను ఎర్టిగా సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి ఇప్పటి వరకూ దేశీయ మార్కెట్లో ఒక లక్షకు పైగా ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయించింది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 30వ తేదీ లోపుగా ఎర్టిగా ఎమ్‌పివిని టెస్ట్ డ్రైవ్ చేయండి, ఖచ్ఛితమైన బహుమతులను పొందండని మారుతి సుజుకి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.

దేశీయ ఎమ్‌పివి సెగ్మెంట్లో పోటీ నానాటికీ పెరుగుతున్నప్పటికీ మారుతి సుజుకి మాత్రం స్థిరంగా నెట్టుకొని వస్తోంది. ఎర్టిగా సక్సెస్ సాధించడానికి, అందులో ఉన్న విశిష్టతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఇంజన్స్

ఇంజన్స్

మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న మొత్తం పెట్రోల్ వేరియంట్ కార్లలోనే ఇదివరకెన్నడూ ఉపయోగించని సరికొత్త అత్యాధునిక కె-సిరీస్ 1.4 లీటర్ పెట్రోల్ వివిటి ఇంజన్‌ను ఎర్టిగా ఎమ్‌పివిలో మొట్టమొదటి సారిగా ఉపయోగించారు. ఇకపోతే డీజిల్ వేరియంట్లో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. కంపెనీ ఇటీవలే ఇందులో సిఎన్‌జి వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

పెట్రోల్ ఇంజన్ పెర్ఫామెన్స్:

పెట్రోల్ ఇంజన్ పెర్ఫామెన్స్:

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో అమర్చిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ ఇంజన్ పెర్ఫామెన్స్:

డీజిల్ ఇంజన్ పెర్ఫామెన్స్:

ఇక డీజిల్ వేరియంట్ ఎర్టిగా విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 16 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 20.77 కి.మీ. మైలేజీని మరియు సిఎన్‌జి వెర్షన్ ఎర్టిగా కేజీకి 22.08 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. (అన్ని మైలేజ్‌లు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం).

ఎక్స్టీరియర్స్

ఎక్స్టీరియర్స్

టర్నింగ్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (సైడ్ మిర్రర్స్), పవర్ విండోస్, డిఫాగ్గర్‌తో కూడిన రియర్ విండ్‌షీల్డ్ (వెనుక అద్దం), అల్లాయ్ వీల్స్ డిజైన్, కారు సైడ్ ప్రొఫైల్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్ వంటి వాటితో మొత్తమ్మీద ఎర్టిగా ఓ విశిష్టమైన లుక్ అండ్ ఫీల్ అనుభూతిని కల్పిస్తుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

విలాసవంతమైన కారులో ఉండే ఇంటీరియర్ల అనుభూతినిచ్చేలా ఎర్టిగా ఎమ్‌పివిని ఇంటీరియర్లను తీర్చిదిద్దారు. వెనుక కూర్చునే ప్యాసింజర్ల కోసం ఎర్టిగా రూఫ్‌పై అమర్చిన విశాలమైన ఎసి వెంట్స్, బీజ్ అండ్ లైట్ కలర్ ఇంటీరియర్ ప్లాస్టిక్స్, సెంట్రల్ కన్సోల్‌పై అమర్చిన 2-డిన్ ఆడియో సిస్టమ్ డ్యాష్‌బోర్డుకు మరింత అందమైన లుక్‌నిస్తుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ గేర్ నాబ్ వంటి ప్రత్యేకమైన ఇంటీరియర్లు ఎర్టిగా ఎమ్‌పివి సొంతం.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఎర్టిగా ఎమ్‌పివిలో వెనుక రెండు వరుసలలో (మిడిల్ రో, లాట్స్ రో) ఉండే సీట్లను పూర్తిగా మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. చివరి వరుసలో ప్యాసింజర్లు కూర్చోవాలంటే మధ్య వరుసలో ఉండే సీటును పూర్తిగా ముందు వైపుకు మడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎర్టిగా ఎమ్‌పివిలో స్టీరింగ్ వీల్‌పైనే ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. దీని ద్వారా స్టీరియో సిస్టమ్ శబ్ధాన్ని తగ్గించుకోవచ్చు, పాటలు మార్చుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ఇందులో రెండు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్:

కలర్ ఆప్షన్స్:

* సెరెన్ బ్లూ

* ఇక్రు బీజ్

* ఫైర్‌బ్రిక్ రెడ్

* గ్రానైట్ గ్రే

* డస్కీ బ్రౌన్

* సుపీరియర్ వైట్

* సిల్కీ సిల్వర్

More from DriveSpark

Article Published On: Thursday, September 19, 2013, 13:09 [IST]
English summary
Sales of the Maruti-Suzuki Ertiga have crossed the 100,000 mark. This milestone comes in a short 17 months since the car was launched on April 12, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+