మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్': ఫీచర్లు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న లేటెస్ట్ ఎమ్‌పివి ఎర్టిగా భారత మార్కెట్లో విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిని తొలిసారిగా 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. ఆ తర్వాత ఏప్రిల్ 2012లో కంపెనీ ఈ ఎమ్‌పివిని వాణిజ్య పరంగా మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎర్టిగా ఎమ్‌పివి భారత మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది కాలంలో మారుతి సుజుకి సుమారు 70,000 యూనిట్లకు పైగా ఎర్టిగాలను విక్రయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకి ఇందులో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను అందించనుంది. వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా విడుదల తేదిని కంపెనీ ఖచ్చితంగా వెల్లడించకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన కొన్ని అధికారిక ఫొటోలను, ఫీచర్ల వివరాలను మాత్రం కంపెనీ వివరించింది.

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న లేటెస్ట్ ఎమ్‌పివి ఎర్టిగా భారత మార్కెట్లో విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఓ వార్షికోత్సవ ఎడిషన్ 'ఎర్టిగా ఫెలిజ్'ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
బీజ్ స్టీరింగ్ వీల్ కవర్
కొత్త బీజ్ కలర్ సీట్ కవర్స్
సీట్ కవర్లపై యానివర్స్‌రే బ్యాడ్జింగ్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
బ్యాక్ సీట్ పాకెట్ ఆర్గనైజర్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
స్పెషల్ ఎడిషన్‌ను గుర్తు చేస్తూ ఫెలిజ్ ఎంబ్రాయిడరీతో కూడిన సీట్ పిల్లోస్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
కొత్త డోర్ మ్యాట్స్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
ఏసి కంట్రోల్స్ బార్డర్‌పై బ్లాక్‌వుడ్ ఫినిషింగ్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
కొత్త డోర్ సిల్ గార్డ్స్

మారుతి సుజుకి ఎర్టిగా వార్షికోత్సవ ఎడిషన్ 'ఫెలిజ్'
ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్ కలిగిన ఎర్టిగా ఫెలిజ్ కేవలం విఎక్స్ఐ (పెట్రోల్), విడిఐ (డీజిల్) వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ వార్షికోత్సవ ఎడిషన్‌కు కంపెనీ 'ఎర్టిగా ఫెలిజ్' (Ertiga Feliz) అనే పేరును ఖరారు చేసింది. ఇది కేవలం విఎక్స్ఐ (పెట్రోల్), విడిఐ (డీజిల్) వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఫెలిజ్‌లో లభ్యం కానున్న కొత్త ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ ఫినిషింగ్
- ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్
- ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్
- అవుట్‌సైడ్ మిర్రర్స్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్
- ఇంటీరియర్ స్టయిలింగ్ కిట్
- కొత్త బీజ్ కలర్ సీట్ కవర్స్
- సీట్ కవర్లపై యానివర్స్‌రే బ్యాడ్జింగ్
- బ్యాక్ సీట్ పాకెట్ ఆర్గనైజర్
- బీజ్ స్టీరింగ్ వీల్ కవర్
- ఆప్షనల్ బ్లూటూత్, జిపిఎస్ టచ్‌స్క్రీన్
- రియర్ స్పాయిలర్
- డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్
- ఏసి కంట్రోల్స్ బార్డర్‌పై బ్లాక్‌వుడ్ ఫినిషింగ్
- కొత్త డోర్ మ్యాట్స్, డోర్ సిల్ గార్డ్స్


Click it and Unblock the Notifications








