ఎమ్800 కారు ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసిన మారుతి
మారుతి 800 కథ ముగిసింది.. ఒకప్పుడు చిన్న కారు అనగా టక్కున గుర్తుకు వచ్చేది మారుతి 800 మోడలే. దాదాపు 30 సంవత్సరాల పాటు భారత మధ్య తరగతి ప్రజల కారు కలను నిజం చేసిన మారుతి 800 కారు ఇక మధుర జ్జాపకంగా మిగిలిపోనుంది. భారతీయుల గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని సంపాధించిన్న ఈ కారు ఇప్పుడు చరిత్రకే పరిమితం కానుంది.
మారుతి 800 కారు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. గడచిన నెల 18వ తేది నుంచి ఈ మోడల్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశామని మారుతి సుజుకి ఇండియా ఈడి రామన్ తెలిపారు. అయితే, ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, నిబంధనల ప్రకారం మారుతి 800 విడిభాగాలు మరో 8-10 ఏళ్ల పాటు అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.

మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బాక్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో కూడా తాము మార్కెట్ నుంచి ఉపసంహరించిన కారు మోడళ్ల విడిభాగాల విషయంలో ఇదే విధంగా 8 నుంచి 10 సంవత్సరాల పాటు విడిభాగాలను అందుబాటులో ఉంచామని, కాగా.. ఈ ఎమ్800 కారు విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్‌సహా మొత్తం 13 నగరాల్లో 2010 ఏప్రిల్ నుంచే కంపెనీ తమ ఎమ్800 మోడల్ విక్రయాలను కంపెనీ నిలిపివేసింది.


Click it and Unblock the Notifications








