స్పోర్టీ వెర్షన్ స్విఫ్ట్ ఆర్‌ఎస్‌ను విడుదల చేసిన మారుతి
స్విఫ్ట్ ప్రియులకు ఓ స్వీట్ న్యూస్. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి నుంచి అత్యతంత పాపులర్ అయిన మరియు అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు ఓ సరికొత్త అవతారంలో అందుబాటులోకి వచ్చింది. స్పోర్టీ వెర్షన్ స్విఫ్ట్ కోరుకునే వారి కోసం 'స్విఫ్ట్ ఆర్ఎస్' (Swift RS)ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరికొత్త స్టయిలింగ్, ఆకర్షనీమైన బాడీ గ్రాఫిక్స్‌తో మరింత స్పోర్టీ ఫీల్‌ను అందిస్తుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్ పరిమిత సంఖ్యలో కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉండనుంది. స్విఫ్ట్ ఆర్ఎస్ అనేక సిగ్నేచర్ స్టయిల్ ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇది సిగ్నేచర్ ఆర్ 3-పీస్ బాడీ కిట్‌తో లభిస్తుంది. ఈ బాడీ కిట్‌లో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు రూఫ్ స్పాయిలర్ ఉంటాయి. స్పోర్టీ ఫీల్‌ను ఇచ్చేందుకు గాను స్విఫ్ట్ ఆర్ఎస్‌ను ప్రత్యేకించి మోటార్‌స్పోర్ట్ గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది బ్లాక్ అండ్ బ్లూ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్
స్పోర్టీ వెర్షన్ స్విఫ్ట్ కోరుకునే వారి కోసం 'స్విఫ్ట్ ఆర్ఎస్' (Swift RS)ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరికొత్త స్టయిలింగ్, ఆకర్షనీమైన బాడీ గ్రాఫిక్స్‌తో ఇది మరింత స్పోర్టీ ఫీల్‌ను అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్
స్విఫ్ట్ ఆర్ఎస్ అనేక సిగ్నేచర్ స్టయిల్ ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇది సిగ్నేచర్ ఆర్ 3-పీస్ బాడీ కిట్‌తో లభిస్తుంది. ఈ బాడీ కిట్‌లో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు రూఫ్ స్పాయిలర్ ఉంటాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్
స్పోర్టీ ఫీల్‌ను ఇచ్చేందుకు గాను స్విఫ్ట్ ఆర్ఎస్ బాడీ గ్రాఫిక్స్‌ను ప్రత్యేకించి మోటార్‌స్పోర్ట్ గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది బ్లాక్ అండ్ బ్లూ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్
మొట్టమొదటి సారిగా స్విఫ్ట్ ఆర్ఎస్‌లో బ్లాక్ వీల్ కవర్లను పరిచయం చేసారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్
బ్లూ కలర్ అవుట్ సైడ్ మిర్రర్స్, నాలుగు డోర్లకు క్రింది భాగంలో అమర్చిన సిల్ గార్డ్స్‌పై ప్రకాశించే స్విఫ్ట్ లోగో, ఎక్స్టీరియర్స్‌తో మ్యాచ్ అయ్యేలా బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఆర్ట్ లెథర్‌తో క్రాఫ్ట్ చేయబడిన ఇంటీరియర్స్, ర్యాలీ ఆర్ఎస్ థీమ్‌తో కూడిన ఫ్లోర్‌మ్యాట్స్, సిడి ప్లేయర్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన హై-ఎండ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి సరికొత్త ఫీచర్లను ఈ కొత్త స్విఫ్ట్ ఆర్ఎస్‌లో పొందవచ్చు.
మొట్టమొదటి సారిగా స్విఫ్ట్ ఆర్ఎస్‌లో బ్లాక్ వీల్ కవర్లను పరిచయం చేసారు. బ్లూ కలర్ అవుట్ సైడ్ మిర్రర్స్, నాలుగు డోర్లకు క్రింది భాగంలో అమర్చిన సిల్ గార్డ్స్‌పై ప్రకాశించే స్విఫ్ట్ లోగో, ఎక్స్టీరియర్స్‌తో మ్యాచ్ అయ్యేలా బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఆర్ట్ లెథర్‌తో క్రాఫ్ట్ చేయబడిన ఇంటీరియర్స్, ర్యాలీ ఆర్ఎస్ థీమ్‌తో కూడిన ఫ్లోర్‌మ్యాట్స్, సిడి ప్లేయర్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన హై-ఎండ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి సరికొత్త ఫీచర్లను ఈ కొత్త స్విఫ్ట్ ఆర్ఎస్‌లో పొందవచ్చు.
స్విఫ్ట్ అమ్మకాలు 10 లక్షల యూనిట్లకు చేరువ అవుతున్న నేపథ్యంలో స్విఫ్ట్ ఆర్ఎస్ మోడల్‌ను ప్రవేశపెడుతున్నామని, స్విఫ్ట్ దేశంలో ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉండటమే కాకుండా, ఈ సెగ్మెంట్లో అమ్ముడుపోతున్న నెంబర్ వన్ కారుగా కూడా ఇది కొనసాగుతోందని మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శ్రీ. మనోహర్ భట్ తెలిపారు. మే 2005లో విడుదలైన స్విఫ్ట్ ఇప్పటి వరకు 9.6 లక్షల మంది వినియోగదారులకు చేరువ అయ్యింది.
స్పోర్టీ స్విఫ్ట్ కోరుకునే వారికి ఈ కొత్త స్విఫ్ట్ ఆర్ఎస్ చక్కటి ఆప్షన్‌గా ఉంటుందని, ఈ ప్యాకేజ్ కోసం వినియోగదారులు చెల్లించే ప్యాకేజ్ అత్యధిక విలువను పొందుతారని ఆయన చెప్పారు. స్విఫ్ట్ ఆర్ఎస్ ప్యాకేజ్ ధర రూ.24,500. దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా స్విఫ్ట్ ఆర్ఎస్ విఎక్స్ఐ (పెట్రోల్), విడిఐ (డీజిల్) వేరియంట్లలో పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి త్వరపడండి.. ఈ స్పోర్టీ స్విఫ్ట్ మీ సొంతం చేసుకోండి.


Click it and Unblock the Notifications








