టాప్ ఎండ్ వేరియంట్ మారుతి ఆల్టో 800 విడుదల
మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో 800లో, కంపెనీ ఇప్పుడు ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. మారుతి ఆల్టో 800 విఎక్స్ఐ టాప్-ఎండ్ వేరియంట్ మరికొన్ని అధనపు ఫీచర్లతో లభిస్తుంది.
మారుతి ఆల్టో 800 విఎక్స్ఐ టాప్-ఎండ్ వేరియంట్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డోర్ సైడ్ మౌల్డింగ్స్, ఫుల్ వీల్ కవర్స్, ఆల్ పవర్ విండోస్, యూఎస్‌బి కనెక్టివిటీ మరియు నాలుగు స్పీకర్లతో కూడిన స్టీరియో ఆడియో సిస్టమ్, ఎడమవైపు సైడ్ మిర్రర్, రియర్ స్పాయిలర్ మరియు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ స్టాండర్డ్‌గా లభించనున్నాయి.
కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఈ మారుతి ఆల్టో 800 విఎక్స్ఐ వేరియంట్లో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. మెటాలిక్ వెర్షన్ ఆల్టో 800 విఎక్స్ఐ ధర రూ.3.39 లక్షలుగా ఉండగా, నాన్-మెటాలిక్ ధర రూ.3.35 లక్షలుగా ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై).

ఇప్పటి వరకు ఆల్టో 800 పెట్రోల్, సిఎన్‌జి ఇంధన ఆప్షన్లతో మూడు వేరియంట్లలో (స్టాండర్డ్, ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ) మాత్రమే లభ్యమవుతుండేది. ఇప్పుడు కొత్తగా విఎక్స్ఐ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. కొత్త ఆల్టో 800 కారులో ఉపయోగించిన రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఇస్తాయి.


Click it and Unblock the Notifications








