మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో ప్రవేశపెట్టిన లేటెస్ట్ స్మాల్ కార్ సెలెరియో (Celerio)లో కంపెనీ ఇప్పుడు సిఎన్‌జి వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మారుతి సుజుకి తమ సిఎన్‌జి వేరియంట్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌‌ను వాణిజ్య పరంగా విడుదల చేసింది.

మారుతి సుజుకి సెలెరియో గ్రీన్ (సిఎన్‌జి) పేరిట ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది కేవలం విఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ వేరియంట్‌లో కూడా రెగ్యులర్ పెట్రోల్ వెర్షన్‌లో ఉఫయోగించిన 1.0 లీటర్ కె-నెక్స్ట్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు.

Celerio

సాధారణంగా పెట్రోల్‌తో అయితే ఈ ఇంజన్ గరిష్టంగా 68 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ సిఎన్‌జితో మాత్రం కేవలం 58 హెచ్‍‌‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.ఈ ఇంజన్ రెగ్యులర్ 5-స్పీడ్ గేర్‌‍బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) అందుబాటులో లేదు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఎర్టిగా సిఎన్‌జి మోడళ్లలో ఉపయోగిస్తున్న మారుతి పేటెంటెడ్ ఐజిపిఐ సిస్టమ్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. డ్యూయెల్ మోడ్‌లో ఉన్నప్పుడు గ్యాస్‌ను నేరుగా కంబస్టియన్ ఛాంబర్‌కు సరఫరా చేయటంలో సిఎన్‌జి ఇంధన సరఫరాని కంట్రోల్ చేయటానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.


సిఎన్‌జి మోడ్‌లో మారుతి సెలెరియో గ్రీన్ గరిష్టంగా కేజీ సిఎన్‌జి 31.79 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కేవలం పెట్రోల్ మోడ్‌లో మాత్రమే అయితే లీటరుకు 23.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కారులో సిఎన్‌జి సిలిండర్ బరువు చేరడం వలన దీని డ్రైవింగ్ డైనమిక్స్‌లో కొద్దిగా మార్పులు ఉంటాయి. దీనిని నివారించేందుకు మారుతి దీని సస్పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేసింది.

దేశీయ విపణిలో మారుతి సెలెరియో గ్రీన్ (సిఎన్‌జి) ధరను రూ.4.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2014, 10:09 [IST]
English summary
Maruti Suzuki has introduced the CNG variant of its new hatchback Celerio. Maruti Celerio Green has the CNG version is called, is only available in the VXi trim and priced at Rs 4.68 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+