లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి సెలెరియో విడుదల

By Ravi

పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలను పెంచుకునేందుకు కార్ కంపెనీ తాము విక్రయించే ఉత్పత్తులలో కొన్నింటికి అధనపు ఫీచర్లను జోడించి స్పెషల్/లిమిటెడ్ ఎడిషన్ల పేరిట విక్రయిస్తున్నారు. తాజాగా.. మారుతి సుజుకి ఇండియా కూడా తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ సెలెరియో హ్యాచ్‍‌బ్యాక్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.

కంపెనీ విక్రయిస్తున్న సెలెరియో విఎక్స్ఐ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని, ఈ వేరియంట్‌కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి లిమిటెడ్ ఎడిషన్‌గా మారుతి సుజుకి విక్రయిస్తోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి సెలెరియో విఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో, రెగ్యులర్ వేరియంట్ కన్నా ఎక్కువ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

maruti suzuki celerio limited edition

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి సెలెరియో విఎక్స్ఐ ప్లస్ ప్యాకేజ్‍‌లో భాగంగా.. టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, జేవిసి డబుల్ డిన్ స్టీరియో సిస్టమ్, ఎమ్‌జిఏ స్పీకర్స్, హై-టెక్ సెక్యూరిటీ సిస్టమ్ మొదలైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మొత్తం ఫీచర్ల విలువ సుమారు రూ.14,000.

మారుతి సెలెరియో విఎక్స్ఐ లేదా ఎల్ఎక్స్ఐ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ విఎక్స్ఐ ప్లస్ ప్యాకేజ్‌ను ఎంచుకొని తమ రెగ్యులర్ సెలెరియోను కూడా లిమిటెడ్ ఎడిషన్ సెలెరియోగా మార్చుకోవచ్చు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకిలో అదనపు ఫీచర్లు మినహా ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

More from DriveSpark

Article Published On: Monday, September 29, 2014, 12:44 [IST]
English summary
Japanese automobile giant Maruti Suzuki has introduced their Limited Edition Celerio VXi+. The vehicle will be packed with features and will include several goodies specific to the variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+