మారుతి సుజుకి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తన్ని ఎర్టిగా ఎమ్‌పివిభారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,50,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని, కంపెనీ ఇందులో లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా మోడల్‌ను ప్రవేశపెట్టింది. రెగ్యులర్ మారుతి ఎర్టిగాతో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగాలో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
లిమిటెడ్ ఎడిషన్ మారుతి ఎర్టిగా ఎమ్‌పివిలో రియర్ స్పాయిలర్, క్రోమ్ గ్రిల్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ కలర్ (పెరల్ బ్లేజ్ బ్లూ) మరియు గ్రాఫిక్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లున్నాయి. ఇంకా ఇందులో.. బ్లాక్ అండ్ బీజ్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు డోర్స్‌పై ఉడెన్ ఫినిషింగ్, లిమిటెడ్ ఎడిషన్ ఫ్లోర్‌మ్యాట్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి.

అంతేకాకుండా, ఈ ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్స్, హై గ్రేడ్ ఆడియో సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కొత్త ఎర్టిగా ఎమ్‌పివిలో కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ తప్ప మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఇది పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభిస్తుంది. వాటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా (పెట్రోల్) - రూ.6.76 లక్షలు
* లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా (సిఎన్‌జి) - రూ.7.34 లక్షలు
* లిమిటెడ్ ఎడిషన్ ఎర్టిగా (డీజిల్) - రూ.8.05 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








