మారుతి సుజుకి రిట్జ్‌లో లిమిటెడ్ ఎడిషన్ విడుదల
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ రిట్జ్‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. మారుతి రిట్జ్ ఎట్ బజ్ (Ritz @buzZ) అనే పేరుతో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను మారుతి విడుదల చేసింది.
మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఫెలిజ్, స్విఫ్ట్ స్టార్ మరియు స్విఫ్ట్ డిజైర్ రీగల్ లిమిటెడ్ ఎడిషన్ల మాదిరిగానే ఈ కొత్త రిట్జ్ ఎట్ బజ్ కూడా మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో లభ్యం కానుంది. సాధారణ రిట్జ్‌తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ రిట్జ్‌లో మొత్తం 12 అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.
యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన అధునాతన ఆడియో సిస్టమ్, రిట్జ్ బ్రాండెడ్ ఆర్ట్ లెథర్ సీట్ కవర్, అసిస్టివ్ రియర్ పార్కింగ్ సెన్సార్, స్టీరింగ్ వీల్ కవర్, బంపర్ ప్రొటెక్టర్, స్టయిలిష్ డోర్ సిల్ గార్డ్స్, రియర్ పార్సెల్ ట్రే, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, మడ్ ఫ్లాప్స్, 6 స్పీకర్స్, డోర్ విజర్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఫీచర్లు లభిస్తాయి.




Click it and Unblock the Notifications








