మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ పేరుతో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో స్టాండర్డ్ వ్యాగన్ఆర్‌లో లభించే ఫీచర్ల కన్నా అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ వేరియంట్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, బ్లూటూత్ ఆధారిత డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, కొత్త సీట్ కవర్స్ స్టీరింగ్ వీల్ కవర్, కొత్త ఫ్లోర్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ వంటి అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇంకా ఇది సరికొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు కొత్త వీల్ కవర్స్‌తో లభిస్తుంది.

Maruti Suzuki Launches Wagon R Krest Limited Edition

ఈ అదనపు ఫీచర్ల విలువ సుమారు రూ.32,500. అయితే, స్టాండర్డ్ వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ వ్యాగన్ఆర్ క్రెస్ట్ ధర రూ.22,500లు అధికంగా ఉంటుంది. ఈ వేరియంట్ కొనుగోలుపై కస్టమర్లు సుమారు రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇకపోతే, కొత్త మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.0 లీటర్, 3-సిలిండర్, కె10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన ప్రకారం, పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ లీటరుకు 20.5 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కి.మీ. మైలేజీ మరియు ఎల్‌పిజి వెర్షన్ కేజీకి 14.6 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2014, 19:01 [IST]
English summary
Maruti Suzuki has launched a new limited edition model in its popular hatchback WagonR. Called the WagonR Krest, it gets a host of additional features like a new front grille, slightly redone front bumper and a set of body graphics.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+