మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తమ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో 'రిట్జ్ ఎలేట్' (Ritz Elate) పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి రిట్జ్ ఎలేట్ మోడల్‌లో లభ్యమయ్యే ఫీచర్ల వివరాలను ఈ కథనంలో ఫొటోల రూపంలో తెలుసుకుందాం రండి.

రెగ్యులర్ వెర్షన్ రిట్జ్‌కి ఈ కొత్త రిట్జ్ ఎలేట్ మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా, ఇందులో అదనపు ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ తప్ప ఇంజన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో లభ్యమవుతోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ మోడల్ సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

ఇందులో ఆరెంజ్ కలర్ యాంబీంట్ ఇంటీరియర్ లైటింగ్ మరియు ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్‌తో కూడిన సీట్ కవర్స్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ ఇంటీరియల్ లుక్ ఫీల్‌లో మార్పును తెస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

సంగీత ప్రియుల కోసం రిట్జ్ ఎలేట్‌లో జెవిసి 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్ (స్పీకర్లతో పాటుగా)ను ఆఫర్ చేస్తున్నారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

డ్రైవర్ కోసం రిట్జ్ ఎలేట్ బ్రాండింగ్‌తో కూడిన నెక్ కుషనింగ్, బ్యాక్‌రెస్ట్ కోసం పిల్లోను ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

కారును సురక్షితంగా రివర్స్ చేసేందుకు గాను ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌ను అందిస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

వైర్‌లెస్‌గా ఫోన్ కాల్స్ చేసేందుకు గాను బ్లావ్‌పంక్ట్ బ్లూటూత్ కిట్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

రిట్జ్ బ్రాండెడ్ ఫ్లోర్‌మ్యాట్స్ ఇందులో మరో ప్రత్యేకత.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్ కవర్, ఓ మల్టీ పర్పస్ బ్యాగ్‌ను కూడా మారుతి సుజుకి ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

వర్షాకాలం కోసం బ్లాక్ డోర్ విజర్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

ధృడమైన మడ్ ఫ్లాప్స్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్ కూడా రిట్జ్ ఎలేట్‌లో లభిస్తాయి.

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ ధరను మారుతి సుజుకి వెల్లడించకపోయినప్పటికీ, రెగ్యులర్ వేరియంట్ల కన్నా దీని ధర సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, July 16, 2014, 9:57 [IST]
English summary
Maruti Suzuki has launched Ritz Elate limited edition. Maruti Ritz Elate is loaded with 12 new additional features. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+