మారుతి సుజుకి స్టింగ్‌రే: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

ప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు, అలాగే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు గాను ఓ సరికొత్త కారును నేడు (ఆగస్ట్ 21, 2013) భారత మార్కెట్లో విడుదల చేసింది.

'మారుతి సుజుకి స్టింగ్‌రే' (Maruti Suzuki Stingray) పేరుతో దేశీయ విపణిలో విడుదలైన ఈ చిన్న కారు, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మూడు వేరియంట్లలో లభిస్తుంది. కేవలం రూ.4.09 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మారుతి సుజుకి ఈ స్టింగ్‌రే హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది.

మారుతి సుజుకి స్టింగ్‌రే కారులో 1.0 లీటర్ కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, స్టింగ్‌రేలో మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తదితర వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి స్టింగ్‌రే కారులో 1.0 లీటర్ కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. (ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న రెగ్యులర్ వ్యాగన్ఆర్‌, ఆల్టో కె10, ఏ-స్టార్ మరియు ఎస్టిలో కార్లలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు). ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మారుతి సుజుకి స్టింగ్‌రే హ్యాచ్‌‍బ్యాక్ లీటరు పెట్రోలుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇది పెట్రోల్‌ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

ఇదివరకటి స్పై చిత్రాలలో గమనించినట్లుగానే, మారుతి సుజుకి స్టింగ్‌‌రే ముందువై విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. సన్నటి గ్రిల్, సన్నటి షార్ప్ హెడ్‌లైట్స్ (ప్రొజెక్టర్ స్టైల్ ల్యాంప్స్), పెద్ద ఎయిర్ డ్యామ్, దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఫ్రంట్ బానెట్‌లను ఈ కారులో చూడొచ్చు.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

గన్ మెటల్ కలర్ ఉండే స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను మారుతి సుజుకి స్టింగ్‌రేలో గమనించవచ్చు. అయితే, ఈ అల్లాయ్ వీల్స్ కేవలం విఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నాయి.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

స్టింగ్‌రే వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఇది వెనుక వైపు నిటారుగా ఉన్నట్లు అనిపిస్తుంది. టెయిల్ లైట్లకు క్రోమ్ లైనింగ్‌ను జోడించి మరింత ప్రీమియం లుక్‌ను కల్పించారు.

ఇంటీరియర్స్‌

ఇంటీరియర్స్‌

బ్లాక్ కలర్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, క్రోమ్ కోటెడ్ గేర్ షిఫ్టర్ నాబ్, ఏసి వెంట్స్ మరియు డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ టచ్, లెథర్‌తో కవర్ చేయబడిన 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రిల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, మ్యూజిక్ సిస్టమ్ మొదలైన ఫీచర్లను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు. ఆప్షనల్ ప్యాకేజీలో కస్టమర్లు తమకు నచ్చిన వాటిని ఎంచుకునే వెసలు బాటు కూడా ఉంది.

ఇన్‌ఫర్మేషన్ క్లస్టర్

ఇన్‌ఫర్మేషన్ క్లస్టర్

బ్లూ థీమ్‌లో ఉండే ఈ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ శూన్యం నుంచి దూరం, మైలేజ్, సగటు మైలేజ్‌తో అనేక ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్ వివరాలను తెలియజేస్తుంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్లో పవర్ విండోస్ అందుబాటులో లేవు.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

మారుతి సుజుకి స్టింగ్‌రేలో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్‌లను ఆప్షనల్‌గా ఉంచారు. రియర్ వైపర్, డిఫాగ్గర్, సెక్యూరిటీ సిస్టమ్‌లను విఎక్స్ఐ వేరియంట్లో అందిస్తున్నారు.

కలర్స్

కలర్స్

మారుతి సుజుకి స్టింగ్‌రే ఐదు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది. అవి, మిడ్‌నైట్ బ్లూ, ప్యాషన్ రెడ్, గ్లిస్టెనింగ్ గ్రే, సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్.

ధరలు

ధరలు

స్టింగ్‌రే ఎల్ఎక్స్ఐ: రూ.4,09,999

స్టింగ్‌రే విఎక్స్ఐ: రూ.4,37,999

స్టింగ్‌రే విఎక్స్ఐ (ఆప్షనల్): రూ.4,66,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2013, 16:07 [IST]
English summary
Maruti Suzuki Stingray has made it debut. The Stingray which is a redesigned Wagon R will be sold as a separate model, without the Wagon R name attached to it. Price starts at INR 4.09 lakhs (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+