జెన్ ఎస్టిలో ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి సుజుకి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, భారత మార్కెట్లో విక్రయిస్తున్న చిన్న కారు జెన్ ఎస్టిలో (Zen Estilo) త్వరలోనే కనుమరుగు కానుంది. ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో ఉండకపోవటంతో, దీని ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది.
ఈ సెగ్మెంట్లో ఎత్తుగా ఉండే వ్యాగన్ఆర్, రిట్జ్ వంటి కార్లు పాపులారిటీని దక్కించుకుంటే, జెన్ ఎస్టిలో మాత్రం తమ ప్రాచుర్యాన్ని కోల్పోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో, జెన్ ఎస్టిల్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు మారుతి సుజుకి డీలర్లు ఈ కారుపై రూ.35,000 నుంచి రూ.50,000 వరకూ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి గతంలో అందించిన జెన్ మోడల్‌ను రీప్లేస్ చేస్తూ 2007వ సంవత్సరంలో జెన్ ఎస్టిలో మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే, అప్పట్లో ఈ మోడల్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో 2009లో ఈ మోడల్‌ను మరోసారి రిఫ్రెష్ చేసింది. పాత 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.0 కె10 ఇంజన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ దీని జోరు మాత్రం పెరగలేదు.
గడచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం 850 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అమ్మకాలు సరిగ్గా లేనందు వల్లే మారుతి సుజుకి ఈ మోడల్‌ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా ఇప్పటికే స్కొడా తమ ఫ్యాబియా ఉత్పత్తిని నిలిపివేయగా, హోండా తమ జాజ్ ఉత్పత్తిని నిలిపి వేసిన సంగతి తెలిసినదే. తాజాగా జెన్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ ఏడాది భారత్‌లో మొత్తం మూడు మోడళ్లు మార్కెట్ నుంచి తొలగిపోయినట్లయ్యింది.



Click it and Unblock the Notifications








