మారుతి స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల; మైలేజ్ 26.59 కెఎంపిఎల్
మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రిఫ్రెష్డ్ డిజైన్, ఫీచర్లతో విడుదలైన ఈ కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ ధర రూ.5.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
కొత్త 2015 స్విఫ్ట్ డిజైర్‌లో ముందు వైపు సింగిల్ క్రోమ్ స్లాట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్ క్రోమ్ ఇన్‌సెర్ట్స్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కాగా.. కొత్త డిజైర్ బేసిక్ షేపులో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
గత అక్టోబర్ నెలలో మారుతి విడుదల చేసిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే ఈ స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫోల్డింగ్ మిర్రర్స్, అప్‌డేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రియర్ పవర్ సాకెట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఫీచర్లున్నాయి.

అలాగే, కొత్త 2015 స్విఫ్ట్ డిజైర్ ఇంజన్లను కూడా మెరుగైన మైలేజీనిచ్చే విధంగా ట్యూన్ చేశారు. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.85 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఇకపోతే డీజిల్ వెర్షన్ స్విఫ్ట్ డిజైర్‌లోని 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్‌పిల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు గరిష్టంగా 26.59 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ లీటరుకు గరిష్టంగా 26.59 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తూ ఈ సెగ్మెంట్లోనే కాకుండా భారతదేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారుగా రికార్డు సృష్టించనుంది.

అసలే స్విఫ్ట్ డిజైర్‌కు భలే గిరాకీ, అలాంటిది మరిన్ని అదనపు ఫీచర్లు, కొత్త స్టయిలింగ్, మరింత ఎక్కువ మైలేజ్‌తో ఈ కారు లభిస్తే, ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం ఖాయం. దేశీయ విపణిలో స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ ధరలు:
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ - రూ.5.07 లక్షలు
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.5.20 లక్షలు
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ - రూ.5.85 లక్షలు
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ - రూ.6.80 లక్షలు
డీజిల్ వెర్షన్ ధరలు:
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐ - రూ.5.99 లక్షలు
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ - రూ.6.85 లక్షలు
- 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ - రూ.7.81 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








