జులైలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల అవుతుందా?
మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే సరికొత్త అవతారంలో కనిపించనుంది. ఈ పాపులర్ మోడల్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మారుతి సుజుకి తొలిసారిగా 2005లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం కంపెనీ ఈ మోడల్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా అప్‌డేట్ కానున్న స్విఫ్ట్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.

యాంత్రికపరంగా కొత్త అప్‌గ్రేడెడ్ స్విఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. కాస్మోటిక్/ఫీచర్ ఆప్‌డేట్స్ విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్‌లో డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ (విత్ టర్న్ ఇండికేటర్స్), రీడిజైన్డ్ సెంటర్ మౌంటెడ్ రియర్ బ్రేక్ లైట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి పలు అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి.
ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త స్విఫ్ట్‌లో స్టార్ట్/స్టాప్ బటన్, బ్లూటూత్‌తో కూడిన ఆడియో సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులు ఉండనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2 లీటర్, 4-సిలిండర్ 87 హార్స్‌పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్, 4-సిలిండర్ 75 హార్స్‌పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త స్విఫ్ట్‌లోను ఉపయోగించనున్నారు.
పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేసినప్పటికీ, సెలెరియోలో ఆఫర్ చేసినట్లుగా కొత్త స్విఫ్ట్‌లో కూడా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








