మారుతి సుజుకి స్విఫ్ట్ విండ్‌సాంగ్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'స్విఫ్ట్' కారులో గడచిన సంవత్సరం నవంబర్ నెలలో మహారాష్ట్రలోని లూనావాలాలో జరిగిన విండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ విండ్‌సాంగ్ లిమిటెడ్ ఎడిషన్‌గా లభ్యం కానున్న ఈ స్పెషల్ స్విఫ్ట్‌ను ప్రత్యేకించి మ్యూజిక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి తయారు చేసింది. ఇవి కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం. వైట్ కలర్ స్విఫ్ట్‌పై ఆకర్షనీయమైన బ్లాక్ అండ్ యల్లో గ్రాఫిక్స్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్‌ను డిజైన్ చేశారు.

మారుతి స్విఫ్ట్ విండ్‌సాంగ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో లభ్యమయ్యే ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి..!

మారుతి సుజుకి స్విఫ్ట్ విండ్‌సాంగ్

ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ విండ్‌సాంగ్ కారు ఏ, బి పిల్లర్స్ బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. ఫ్రంట్ బానెట్‌పై నుంచి రియర్ బంపర్ వరకూ రెండు బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి. కారు సైడ్స్‌పై ట్రైకలర్ స్ట్రైప్స్, మ్యూజికల్ సింబల్స్ ఉంటాయి.

స్టయిలిష్ ఇంటీరియర్స్

స్టయిలిష్ ఇంటీరియర్స్

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ విండ్‌సాంగ్ కారులో స్టయిలిష్ ఇంటీరియర్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ సీట్స్‌పై బ్రైట్ యల్లో కలర్ స్ట్రైప్స్ కారు ఇంటీరియర్‌కి మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

సోనీ టచ్‌స్క్రీన్ సిస్టమ్

సోనీ టచ్‌స్క్రీన్ సిస్టమ్

ఈ కారులో సోనీ బ్రాండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్, ఆక్స్-ఇన్, యూఎస్‌బి, ఐఫోన్, ఐప్యాడ్ కనెక్టివిటీలను ఇది సపోర్ట్ చేస్తుంది.

ట్రెండీ సీట్ కవర్స్

ట్రెండీ సీట్ కవర్స్

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ కారులోని సీట్ కవర్స్ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎక్స్టీరియర్ థీమ్‌కి మ్యాచ్ అయ్యే విధంగానే ఈ సీట్ కవర్స్‌ని కూడా బ్లాక్ అండ్ యల్లో షేడ్స్‌లో డిజైన్ చేశారు.

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

మారుతి స్విఫ్ట్ విండ్‌సాంగ్ మోడల్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ రివర్స్ పార్కింగ్ సిస్టమ్ లభిస్తుంది. సులువుగా పార్క్ చేసేందుకు, రివర్స్ చేసేందుకు ఈ సెన్సార్లు చక్కగా ఉపయోగపడుతాయి.

రియర్ స్పాయిలర్

రియర్ స్పాయిలర్

స్విఫ్ట్ విండ్‌సాంగ్ లిమిటెడ్ ఎడిషన్ వెనుక భాగంలో కంపెనీ స్పాయిలర్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది స్పోర్టీ లుక్‌ని ఇవ్వడమే కాకుండా ఇందులోని హై-మౌంట్ బ్రేక్ ల్యాంప్ మంచి సేఫ్టీని అందిస్తుంది.

మ్యాజికల్ థీమ్ గ్రాఫిక్స్

మ్యాజికల్ థీమ్ గ్రాఫిక్స్

మారుతి స్విఫ్ట్ విండ్‌సాంగ్ లిమిటెడ్ ఎడిషన్ సైడ్స్‌పై మ్యూజికల్ థీమ్‌తో కూడిన గ్రాఫిక్స్ ఉంటుంది. అక్కడక్కడా నోట్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ డోరుపై విండ్‌సాంగ్ డీకాల్ ఉంటుంది.

ఇల్యుమినేటెడ్ డోర్ సిల్ గార్డ్స్

ఇల్యుమినేటెడ్ డోర్ సిల్ గార్డ్స్

స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా ఉంచేందుకు ఇందులో సైడ్ డోర్ సిల్ గార్డ్స్‌ను ప్రకాశించే విధంగా డిజైన్ చేశారు. ఇవి బ్లూ కలర్‌లో ప్రకాశిస్తూ, ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం లుక్‌ని తెచ్చి పెడుతాయి.

ఇంటీరియర్ లైటింగ్

ఇంటీరియర్ లైటింగ్

కారులో ఇంటీరియర్ లుక్ అండ్ ఫీల్‌ని మార్చేందుకు ఇందులో బ్లూ యాంబీంట్ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ లైటింగ్ సిస్టమ్ కారు ఇంటీరియర్‌కి మరింత అందాన్ని తెచ్చి పెడుతుంది.

డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్

డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్

స్విఫ్ట్ విండ్‌సాంగ్ కోసం కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్‌ని ఆఫర్ చేస్తోంది.

ధరలు

ధరలు

* స్విఫ్ట్ విండ్‌సాంగ్ విఎక్స్ఐ - రూ.5.15 లక్షలు

* స్విఫ్ట్ విండ్‌సాంగ్ విడిఐ - రూ.6.10 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, January 27, 2015, 13:49 [IST]
English summary
Maruti Suzuki has now launched a new limited edition Swift in 2015 called ‘Windsong'. This model will be offered exclusively in India and only in the VXi and VDi trim levels of Swift. The petrol powered limited edition will cost INR 5,14,973 and the diesel model will cost INR 6,10,246 ex-showroom, Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+