మారుతి సుజుకి సియాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మిడ్-సైజ్ సెగ్మెంట్లో తమ సరికొత్త ఉత్పత్తి 'సియాజ్' (Ciaz) అతి త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే మానేసర్ ప్లాంట్‌లో ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించిన మారుతి సుజుకి, సియాజ్‌కు సంబంధించి 'కూల్ క్యాట్స్ ఇన్ టౌన్' పేరిట ఆన్‌లైన్ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది.
అంతేకాకుండా, మారుతి సుజుకి సియాజ్ కోసం కంపెనీ ఓ మైక్రో వెబ్‌సైన్‌ను కూడా ప్రారంభించింది. http://www.marutisuzuki.com/ciaz.aspx అనే పేరుతో ఈ వైబ్‌సైట్ లైవ్ అయ్యింది. తమ కొత్త సియాజ్ సెడాన్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా మారుతి సుజుకి విడుదల చేసింది.

'రెడ్ కార్పెట్ పరవండి, సియాజ్ వస్తోంది' అంటూ రణ్‌వీర్ సింగ్, సియీజ్‌లతో కూడిన ఓ టీజర్ ఫొటోను మారుతి రిలీజ్ చేసింది. సియాజ్ కారుతో రణ్‌వీర్ సింగ్‌పై ఓ ప్రకటన కూడా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈనెలలోనే (సెప్టెంబర్ 2014) మారుతి సుజుకి సియాజ్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తొలిసారిగా 'సియాజ్'ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.
ఆ సమయంలోనే మారుతి సుజుకి సియాజ్‌కు మంచి స్పందన లభించింది. ఈ కారు మార్కెట్లో విడుదలైతే, దీనికి ఉత్పత్తికి మించి డిమాండ్ ఏర్పడవచ్చనే ఉద్దేశ్యంతో, కంపెనీ ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. సియాజ్ సెడాన్‌ను 'ఎస్ఎక్స్4'కు రీప్లేస్డ్ వెర్షన్‌గా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, మారుతి సుజుకి ఇప్పటికే ఈ పాత మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను మోడ్రన్‌గా డిజైన్ చేసింది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేశారు.
వాస్తవానికి ఇది ఎస్ఎక్స్4 సెడాన్ రీప్లేస్‌మెంట్ మోడల్ అయినప్పటికీ, పాత ఎస్ఎక్స్4 సెడాన్‌కు ఈ కొత్త సియాజ్ సెడాన్‌కు మధ్య ఎలాంటి పోలిక ఉండదు. కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి డిజైన్ మార్పులను ఈ కారులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్స్ మరియు టెక్నాలజీ ఫీచర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉండనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








