ఆటో ఎక్స్‌పో 2014: మారుతి సుజుకి సియాజ్ ఆవిష్కరణ
మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'కు రీప్లేస్డ్ వెర్షన్‌గా ఓ సరికొత్త మోడల్‌ను నేడు (ఫిబ్రవరి 5, 2014) గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో కంపెనీ ఆవిష్కరించింది.
మారుతి సుజుకి సియాజ్ పేరిట కంపెనీ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లతో పోటీ పడనుంది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో ఈ కారును అభివృద్ధి చేశారు.
మారుతి సుజుకి సియాజ్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను మరియు వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో మారుతి సుజుకి సియాజ్ సెడాన్ ఆవిష్కరణ.

పాత ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త సియాజ్ సెడాన్‌లో కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి.

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది.

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఎస్ఎక్స్4 ఇంజన్లనే ఈ కొత్త మారుతి సియాజ్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4 సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుండగా డీజిల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








