మారుతి వ్యాగన్ఆర్ మాధవన్ సిగ్నేచర్ ఎడిషన్ విడుదల
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అందిస్తున్న పెట్రోల్ కారు 'వ్యాగన్ఆర్'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వ్యాగన్ఆర్ మాధవన్ సిగ్నేచర్ ఎడిషన్ పేరిచ విడుదలైన ఈ వ్యాగన్ఆర్ కారులో రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ఈ స్పెషల్ ఎడిషన్ విడుదల గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఓ వార్తా పత్రిక ప్రకటనలో మాత్రం కంపెనీ మాధవన్ సిగ్నేచర్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితమా లేక దేశంలోని ఇతర మార్కెట్లలో కూడా లభిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ, ఈ సరికొత్త మారుతి వ్యాగన్ఆర్ సిగ్నేచర్ ఎడిషన్‌లో లభించే ఆ స్పెషల్ ఫీచర్లంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మాధవన్ సిగ్నేచర్
ఈ స్పెషల్ ఎడిషన్ కారుపై ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ సిగ్నేచర్ ఉంటుంది. ఈ కారుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ ఈ కారులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

స్మార్ట్ ఫీచర్లు
* కెన్‌వుడ్ 2-డిన్ ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్)
* డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన పార్కింగ్ సెన్సార్స్
* బ్లూటూత్ కిట్
* ఆర్ట్ లెథర్ కవర్డ్ సీట్స్, స్టీరింగ్ వీల్
* వ్యాగన్ఆర్ బ్యాడ్జ్‌తో కూడిన కొత్త డోర్ సిల్ గార్డ్స్
* ఫుల్ వీల్ కవర్
* రూఫ్ స్పాయిలర్

ఇంజన్
ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఈ కారులో ఉపయోగించిన 1.0 లీటర్, 3-సిలిండర్ కెబి10 కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పెట్రోల్, సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








