2015లో విడుదల కానున్న మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్‌యూవీ!

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, వచ్చే ఏడాది స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం తమకు స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికిల్‌ (ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో ఎలాంటి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లేవని, అందుకే 2015లో ఓ సరికొత్త ఎస్‌యూవీతో ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నామని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ చీఫ్‌ (వాణిజ్య వ్యాపారం) ఎస్‌ ఎన్‌ బర్మన్‌ తెలిపారు.

Suzuki Grand Vitara

గడచిన సంవత్సరం 2012 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ప్రదర్శించిన ఎక్స్‌ఏ-ఆల్ఫా కాన్సెప్ట్ కారు ఆధారంగా కంపెనీ ఓసరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కాన్సెప్ట్ కారు 4 మీటర్ల పొడవును, 1.9 మీటర్ల వెడల్పును మరియు 1.6 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది.

కాగా.. మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేసిన విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది యూరప్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్‌లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానున్న సుజుకి గ్రాండ్ విటారా రెండూ ఒకటేనా లేక వేరు వేరు మోడళ్లా అనే విషయం తెలియాల్సి ఉంది.


మారుతి సుజుకి 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన ప్రోటోటైప్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'ఎక్స్ఏ ఆల్ఫా' విషయానికి వస్తే.. దీనిని విభిన్న వనరుల నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. మల్లయోధుల (కుస్తీ ఆటగాళ్లు) పట్టు నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్ మరియు రెడ్ కలర్, డేగ కన్నును ప్రేరణగా తీసుకొని రూపొందించిన సరికొత్త షార్ప్ హెడ్ ల్యాంప్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి రూపొందించింది. కేవలం తొమ్మిది నెలల సమయంలోనే మారుతి సుజుకి తమ ఎక్స్ఏ ఆల్ఫా కారును డిజైన్ చేసింది. ఈ ఎక్స్ఏ ఆల్ఫా భారత మార్కెట్లో విడుదలైచే, ప్రస్తుతం మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న జిప్సీ తర్వాత ఇదే మొదటి ఎస్‌యూవీ కానుంది.

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకంటే ముందుగా.. మారుతి సుజుకి మరో క్రాసోవర్‌ను మోడల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ సుజుకి ఎస్ఎక్స్4 మోడల్ ఆధారంగా తయారు చేసిన ఎస్ఎక్స్4 ఎస్ క్రాస్ 2015 జూన్ ప్రాంతంలో భారత మార్కెట్లో విడదుల కావచ్చని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తొలిసారిగా తమ సరికొత్త రగ్గడ్ అండ్ ప్రీమియం లుక్ క్రాసోవర్ ఎస్ఎక్స్4 ఎస్ క్రాస్ క్రాసోవర్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. డాన్‌లోని కంఫర్ట్‌ను ఎస్‌యూవీ లాంటి పవర్‌ను కలబోసి ఈ మారుతి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్ కారును తయారు చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 5, 2014, 16:43 [IST]
English summary
Country’s largest carmaker Maruti Suzuki India is planing to launch the much-anticipated SX4 S-Cross Crossover and XA Alpha concept based Compact SUV in 2015. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+