స్పెషల్ ఎడిషన్ డిజైర్ రీగల్, ఎర్టిగా ఫెలిజ్ అమ్మకాల కొనసాగింపు
గడచిన కొద్ది నెలలుగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, అమ్మకాలను పెంచుకునేందుకు పలు ఉత్పత్తిదారులు వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటే, మరికొందరు స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ దిశలోనే దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సుజుకి ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మరియు ఎర్టిగా ఎమ్‌పివిలలో స్పెషల్ ఎడిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే.
ఈ మోడళ్లు లిమిటెడ్ ఎడిషన్లే అయినప్పటికీ, ప్రస్తుతం అమ్మకాలు స్థబ్దుగా ఉన్న నేపథ్యంలో ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను ఇలానే కొనసాగించాలి కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మారుతి సుజుకి డిజైర్ రీగల్ స్పెషల్ ఎడిషన్ మరియు, మారుతి సుజుకి ఎర్టిగా ఫెలిజ్ వార్షికోత్సవ ఎడిషన్ మోడళ్లు మరింత కాలం మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ రెండు మోడళ్లలో లభ్యం స్పెషల్ ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..?

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా ఫెలిజ్

ఇంటీరియర్ స్టయిలింగ్ కిట్

స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్

రియర్ స్పాయిలర్

బ్యాక్ సీట్ పాకెట్ ఆర్గనైజర్

ఫెలిజ్ బ్రాండింగ్ సీట్ కవర్స్

సిల్వర్ కలర్డ్ గ్రిల్

సిల్వర్ కలర్డ్ ఫాగ్ ఓఆర్‌విఎమ్స్

స్టీరింగ్ వీల్ కవర్

స్టయిలిష్ ఫ్లోర్ మ్యాట్స్

స్టయిలిష్ డోర్ సిల్ గార్డ్స్

ఫెలిజ్ బ్రాండింగ్ కార్ పిల్లోస్

డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్

సిల్వర్ కలర్డ్ ఫాగ్‌ల్యాంప్స్

స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ డిజైర్ రీగల్

బాడీ గ్రాఫిక్స్
ఇది సెరెన్ బ్లూ పెయింట్ షేడ్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభ్యమవుతుంది.

ఫ్రంట్ డిజైన్
సిల్కీ సిల్వర్ కలర్‍లో పెయింట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఓఆర్‌విఎమ్స్, ఫ్రంట్ గ్రిల్స్ (అప్పర్ అండ్ లోవర్).

డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్

క్రోమ్ గార్నిష్, రీగల్ డెకాల్, రీగల్ బ్యాడ్జ్

క్రోమ్ బేస్ రీగల్ బాడీ గ్రాఫిక్స్

బాడీ కలర్ మడ్‌ఫ్లాప్స్

సరికొత్త ఆడియో సిస్టమ్

ఎంబ్రాయిడర్డ్ ఆర్ట్-లెథర్ సీట్ కవర్స్

ఉడెన్ ఫినిష్ ఇంటీరియర్ స్టయిలింగ్ కిట్

హైగ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్ సిల్ గార్డ్.

బ్రాండెడ్ బీజ్ ఫ్లోర్ మ్యాట్స్

ఫుల్ లెథర్ బ్లాక్ కలర్ స్టీరింగ్ వీల్ కవర్

క్లాసీ బీజ్ ఎంబ్రాయిడర్డ్ ఆర్ట్ లెథర్ కుషన్స్



Click it and Unblock the Notifications








