ఆటో ఎక్స్‌పో: మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

రెగ్యులర్ మారుతి స్విఫ్ట్‌ను చూసి బోర్ కొట్టేసిందా..? అయితే, ఈ సరికొత్త స్విఫ్ట్‌ను చూడండి. దీని పేరు 'మారుతి స్విఫ్ట్ వోల్ట్'. రెగ్యులర్ స్విఫ్ట్‌ను హెవీగా మోడిఫై చేసి, అప్‌గ్రేడ్ చేసిన మోడల్ ఇది.

ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ సరికొత్త స్విఫ్ట్ వోల్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును ప్రదర్శనకు ఉంచింది.

రెగ్యులర్ మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఎన్ని రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చునో తెలిపేందుకే మారుతి సుజుకి ఈ కారును తయారు చేసింది. మరి ఈ స్టన్నింగ్ స్విఫ్ట్ వోల్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి స్టాల్‌లో ప్రదర్శించిన రెగ్యులర్ స్విఫ్ట్ ప్రయాణీకులను ఆకట్టుకుందో లేదా కానీ, ఈ మోడిఫైడ్ స్విఫ్ట్ వోల్ట్ మాత్రం వీక్షకులను కట్టిపడేసింది. మారుతి స్టాల్‌లో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

రేస్ కారును తలపించేలా మారుతి సుజుకి ఈ స్విఫ్ట్‌ను కస్టమైజ్ చేసింది, స్పోర్టీ స్టయిలిష్ స్పాయిలర్, సరికొత్త బంపర్, ఆకర్షనీయమైన రేస్ టైప్ బాడీ డెకాల్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

ఈ ఫొటోను క్షుణ్ణంగా గమనించండి. ఇందులో రియర్ వ్యూ మిర్రర్స్ లేవు. వాటి స్థానంలో కెమెరాలను రీప్లేస్ చేశారు. ఈ కెమెరాలు రియర్ వ్యూ మిర్రర్లుగా పనిచేస్తాయి. ఇవి చిత్రీకరించే వీడియో కారు లోపల ఉండే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

మారుతి స్విఫ్ట్ వోల్ట్ రూఫ్ కలర్‌ను రెడ్ కలర్‌లోను, సి-పిల్లర్‌ను బ్లాక్ కలర్‌లోను పెయింట్ చేశారు. దీనికి తోడు వైట్ కలర్ బాడీపై బ్లాక్ గ్రాఫిక్స్ ఈ కారు మరింత అదనపు శోభను తెచ్చిపెడుతాయి.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ ఆవిష్కరణ

మారుతి స్విఫ్ట్ వోల్ట్ కేవలం డిస్‌ప్లే మోడల్ మాత్రమే. మారుతి సుజుకి ఈ కారును ప్రత్యేకించి ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014 కోసం తయారు చేసింది.

More from DriveSpark

Article Published On: Saturday, February 8, 2014, 16:02 [IST]
English summary
Maruti enthralls the crowd with a stylish swift avatar ‘Volt' at the 2014 auto expo. The swift model is a head-turner in India. The swift volt showcased here is a modified version of the street car. Maruti's intention was purely to showcase the possibilities of how one can modify, and lift the oomph factor of a swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+