మారుతి స్విఫ్ట్ వోల్ట్ కస్టమ్ కిట్ ధర రూ.2.15 లక్షలు
ఇటీవలే గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద జరిగిన 2014వ ఆటో ఎక్స్‌పోలో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఆవిష్కరించిన కస్టమైజ్డ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 'స్విఫ్ట్ వోల్ట్' గుర్తుందా..? ఇప్పుడు రెగ్యులర్ స్విఫ్ట్ కస్టమర్లు కూడా తమ ప్రస్తుత స్విఫ్ట్‌ను ఇదిగో ఇలా స్విఫ్ట్ వోల్ట్‌గా మరింత స్పోర్టీగా మార్చేసుకోవచ్చు.
మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ వోల్ట్ కస్టమ్ కిట్‌ను న్యూఢిల్లీలోని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే, ఈ కస్టమైజేషన్ కిట్ ధర వింటే మాత్రం షాక్‌కు గురవక తప్పదు. ఈ కస్టమ్ కిట్ ప్యాకేజ్ ధర రూ.2.15 లక్షలుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. మరి ఈ స్టన్నింగ్ స్విఫ్ట్ వోల్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి స్టాల్‌లో ప్రదర్శించిన రెగ్యులర్ స్విఫ్ట్ ప్రయాణీకులను ఆకట్టుకుందో లేదా కానీ, ఈ మోడిఫైడ్ స్విఫ్ట్ వోల్ట్ మాత్రం వీక్షకులను కట్టిపడేసింది. మారుతి స్టాల్‌లో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

రేస్ కారును తలపించేలా మారుతి సుజుకి ఈ స్విఫ్ట్‌ను కస్టమైజ్ చేసింది, స్పోర్టీ స్టయిలిష్ స్పాయిలర్, సరికొత్త బంపర్, ఆకర్షనీయమైన రేస్ టైప్ బాడీ డెకాల్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ ఫొటోను క్షుణ్ణంగా గమనించండి. ఇందులో రియర్ వ్యూ మిర్రర్స్ లేవు. వాటి స్థానంలో కెమెరాలను రీప్లేస్ చేశారు. ఈ కెమెరాలు రియర్ వ్యూ మిర్రర్లుగా పనిచేస్తాయి. ఇవి చిత్రీకరించే వీడియో కారు లోపల ఉండే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మారుతి స్విఫ్ట్ వోల్ట్ రూఫ్ కలర్‌ను రెడ్ కలర్‌లోను, సి-పిల్లర్‌ను బ్లాక్ కలర్‌లోను పెయింట్ చేశారు. దీనికి తోడు వైట్ కలర్ బాడీపై బ్లాక్ గ్రాఫిక్స్ ఈ కారు మరింత అదనపు శోభను తెచ్చిపెడుతాయి.

మారుతి సుజుకి ఈ కారును ప్రత్యేకించి ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014 కోసం తయారు చేసిన స్విఫ్ట్ వోల్ట్ కస్టమ్ కిట్‌ను ఇప్పుడు న్యూఢిల్లీలోని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








