మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
కార్ల కంపెనీలు స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేయటం ఒక ఎత్తయితే, సదరు కార్ కంపెనీ డీలర్లు స్పెషల్ ఎడిషన్లను ఆఫర్ చేయటం మరొక ఎత్తు. రాజస్థాన్‌లో ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ లభ్యమవుతోంది. అక్కడ ఓ స్థానిక మారుతి సుజుకి డీలర్ బేస్ వేరియంట్స్ పెట్రోల్, డీజిల్ స్విఫ్ట్‌లను ఆధారంగా చేసుకొని, అందుకు కొన్ని అదనపు ఫీచర్లు జోడించి స్పెషల్ ఎడిషన్‌గా విక్రయిస్తున్నారు.
మారుతి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ (Maruti Swift XDi) పేరుతో రాజస్థాన్‌లో లభ్యమవుతున్న ఈ కారు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో లభ్యమవుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. బేస్ పెట్రోల్ వేరియంట్ ఎల్ఐక్స్ఐ, బేస్ డీజిల్ వేరియంట్ ఎల్‌డిఐలను ఆధారంగా చేసుకొని వీటి తయారు చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ ఎక్స్‌డి కారులో లభ్యం కానున్న స్పెషల్ ఫీచర్ల లిస్ట్‌ను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి స్విఫ్ట్ ఎక్స్‌డిఐ వేరియంట్లో యాంత్రికపరమైన మార్పులేవీ లేవు. రెగ్యులర్ వెర్షన్లలో ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఈ స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్‌లోను ఉపయోగించనున్నారు.

స్విఫ్ట్ ఎక్స్‌డిఐ స్పెషల్ ఎడిషన్ ధరలు రూ.5.44 లక్షలు (పెట్రోల్ వెర్షన్), రూ.6.67 లక్షలు (డీజిల్ వెర్షన్)లుగా ఉన్నాయి. (అన్ని ఆన్-రోడ్, జైపూర్)గా ఉన్నాయి. అంతేకాకుండా, మారుతి సుజుకి ఈ స్పెషల్ ఎడిషన్ వేరయంట్ స్విఫ్ట్ ఎక్స్‌డిఐపై రూ.20,000 ఎక్సేంజ్ బోనస్, రూ.15,000 లాయల్టీ బోనస్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.

మ్యూజిక్ ప్రియుల కోసం డబుల్-డిన్ మ్యూజిక్ సిస్టమ్.

డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సౌకర్యార్థం ఫ్రంట్ పవర్ విండోస్.

లగ్జరీ లుక్, సౌకర్యవంతమైన ఫీల్‌ను కల్పించే ఆల్-లెథర్ సీట్ కవర్స్.

డ్రైవర్ సౌకర్యానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేలా టిల్ట్ స్టీరింగ్.

సేఫ్టీ కోసం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ సిస్టమ్.

సేఫ్ పార్కింగ్, రివర్సింగ్ కోసం డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్.

స్విఫ్ట్ బ్యాడ్జింగ్, ఇల్యుమినేషన్‌తో కూడిన డోర్ సిల్ గార్డ్స్.

టర్న్ ఇండికేటర్లతో కూడిన కొత్త సైడ్ మిర్రర్స్.

ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్.


Click it and Unblock the Notifications








