ఎలైట్ ఐ20కి పోటీగా మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన రిఫ్రెష్డ్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు గట్టి పోటీనిచ్చేందుకు మారుతి సుజుకి ఇండియా కూడా ఓ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు ఎగువన ఈ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మోడల్‌ను వైఆర్ఏ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మారుతి వైఆర్ఏని కంపెనీ భారత్‌లో టెస్టింగ్ కూడా చేస్తోంది.

మారుతి వైఆర్ఏ కారుకు సంబంధించి స్పైచిత్రాలు కూడా ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. మారుతి స్విఫ్ట్ కన్నా మరింత విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండేలా, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను వెడల్పుగా ఉండేలా డిజైన్ చేయనున్నారు.
మారుతి వైఆర్ఏ కారులో 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని సమాచారం. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ ఎలైట్ ఐ20, ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి, ఫియట్ పుంటో ఇవో 90 హెచ్‌పి మోడళ్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








