కొత్త కార్లు రావటంతో పాత కార్లపై భారీ డిస్కౌంట్స్!
కొత్త నీరు వస్తే, పాత నీరు పోవాల్సిందే అన్న చందంగా.. కార్ కంపెనీలు ఇటీవలే కొత్త కార్లను విడుదల చేసిన/విడుదల చేయనున్న నేపథ్యంలో, తమ పాత మోడళ్ల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆయా మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఇటీవల విడుదలైన కొత్త వాహనాలు
పాత మోడల్ అయినా ఫర్వాలేదు, తక్కువ ధరకు లభిస్తే చాలు అనుకునే వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సరసమైన ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. ఫోక్స్‌వ్యాగన్, మారుతి సుజుకి, ఫియట్, టాటా మోటార్స్ కంపెనీలు తమ పాత మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో పాత మోడల్ కార్లపై లభించే డిస్కౌంట్ వివరాలను తెలుసుకోండి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో - రూ.70,000 డిస్కౌంట్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవలే కొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఇదివరకటి పోలో కారుపై కంపెనీ రూ.50,000 నగదు తగ్గింపును మరియు రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో - రూ.1.2 లక్షల డిస్కౌంట్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవల రిఫ్రెష్డ్ పోలో కారును విడుదల చేసినట్లు గానే త్వరలో రిఫ్రెష్డ్ వెంటో సెడాన్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, పాత తరం వెంటో సెడాన్‌పై కంపెనీ రూ.90,000 నగదు తగ్గింపును మరియు రూ.30,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి ఎస్ఎక్స్4 - రూ.90,000 డిస్కౌంట్
మారుతి సుజుకి ఇండియా మరికొద్ది రోజుల్లో ఎస్ఎక్స్4 సెడాన్‌కు రీప్లేస్డ్ వెర్షన్‌గా తమ సరికొత్త సియాజ్ సెడాన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ తమ ఎస్ఎక్స్4 కారుపై రూ.90,000 వరకూ విలువైన బెనిఫిట్లను కస్టమర్లకు అందిస్తోంది.

ఫియట్ గ్రాండే పుంటో - రూ.70,000 తగ్గింపు
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా ఇటీవలే తమ రిఫ్రెష్డ్ వెర్షన్ పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన నేపథ్యంలో, కంపెనీ తమ పాత మోడల్ ఫియట్ గ్రాండే పుంటో కారుపై రూ.50,000 నగదు తగ్గింపును మరియు రూ.20,000 విలువైన ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.

టాటా ఇండికా విస్టా - రూ.63,500 తగ్గింపు
ఇటీవలే టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసిన టాటా మోటార్స్ మరికొద్ది రోజుల్లో టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ తమ టాటా ఇండికా విస్టా మోడల్‌పై రూ.63,500 విలువైన ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రాంతాన్ని మరియు డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత షోరూమ్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








