ఇండోనేషియాలో ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్ మజ్దా విఎక్స్-1 విడుదల
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఎమ్‌పివిని ఎక్కడో చూసినట్లుంది కదూ..! సరిగ్గా చూడండి ఇది మన మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగాకు డూప్లికేట్‌లా లేదూ..? మీ అనుమానం నిజమే. ఇది మారుతి సుజుకి ఎర్టిగాకు రీబ్యాడ్జ్ వెర్షన్. దీని పేరు 'మజ్దా విఎక్స్-1'. భారత మార్కెట్లో లభిస్తున్న (మేడ్ ఇన్ ఇండియా) ఎర్టిగాను సుజుకి మోటార్స్ ఇండోనేషియాకు దిగుమతి చేసుకొని, అక్కడి మార్కెట్లో మజ్దా విఎక్స్-1 పేరుతో విక్రయిస్తోంది.
జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ (మారుతి సుజుకి మాతృ సంస్థ)కు అదే జపాన్‌కు చెందిన మజ్దా మోటార్ కార్పోరేషన్ సంస్థలకు కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎర్టిగా ఎమ్‌పివిని ఇలా రీబ్యాడ్జ్ చేసి మజ్దా విఎక్స్-1గా విక్రయిస్తున్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎర్టిగా ఎమ్‌పివిని సుజుకి ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో ఉన్న ప్లాంటులో ఈ మోడల్‌కు కొద్దిపాటి మార్పులు చేర్పులను చేసి మజ్దా విఎక్స్-1 రూపాంతం చేస్తుంది.
ఇండోనేషియా మార్కెట్లో విడుదలైన మద్జా విఎక్స్-1 కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో సుజుకి కె-సిరీస్ 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 95 పిఎస్‌ల శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అక్కడి మార్కెట్లో ఇది రెండు వేరియంట్లలో (వి-గ్రేడ్, ఆర్-గ్రేడ్) లభ్యం కానుంది. బేస్ వేరియంట్ (వి-గ్రేడ్) ధర రూ.10.07 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ (ఆర్-గ్రేడ్) ధర రూ.10.76 లక్షలుగా ఉన్నాయి.

ఇండోనేషియాలో ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్ మజ్దా విఎక్స్-1 విడుదల
మజ్దా విఎక్స్-1

మారుతి సుజుకి ఎర్టిగా

ఎర్టిగాకు రీబ్యాడ్జ్ వెర్షన్ విడుదల చేయటం వెనుక కారణం ఎంటి?
సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇప్పటి ఎర్టిగా ఎమ్‌పివిని ఇండోనేషియా మార్కెట్లో అదే పేరుతో ఆటోమేట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ మోడల్‌కు అక్కడి మార్కెట్లో అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు 20,000 ఎర్టిగాలు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో, ఎర్టిగా డిమాండ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు ఈ మోడల్‌ను మజ్దా విఎక్స్-1 పేరుతో విక్రయించడం జరుగుతోంది.

Click it and Unblock the Notifications