మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ: వివరాలు

By Ravi

బ్రిటీష్ సూపర్‌‌కార్ కంపెనీ మెక్‌లారెన్ తాజాగా మరో సరికొత్త సూపర్‌కారును ఆవిష్కరించింది. వచ్చే నెలలో జరగనున్న 2014 జెవీవా మోటార్ షో నేపథ్యంలో, కంపెనీ తమ సరికొత్త 'మెక్‌లారెన్ 650ఎస్' సూపర్‌కారు సంబంధించిన ఫొటోలు, వివరాలను వెల్లడి చేసింది.

ప్రస్తుతం మెక్‌లాపరెన్ అందిస్తున్న పి1 మరియు ఎమ్‌పి4-12సి మోడళ్లకు మధ్యలో ఈ సరికొత్త 650ఎస్ మోడల్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. మెక్‌లారెన్ 650ఎస్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక అప్‌డేటెడ్ మెక్‌లారెన్ 12సి అనొచ్చు. మెక్‌లారెన్ పి1 నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను ఇందులో గమనించవచ్చు.

వాస్తవానికి మెక్‌లారెన్ 12సిలో ఉపయోగించిన ఇంజన్‌నే మరింత ఎక్కువ పవర్ వచ్చేలా రీట్యూన్ చేసి మెక్‌లారెన్ 650ఎస్‌లో ఉపయోగించారు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

ఆకర్షనీయమైన స్పోర్టీ లుక్ డిజైన్‌ను కలిగి ఉండే మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కారును గంటకు 241 కిలోమీటర్ల వేగం వద్ద నడుపుతున్నప్పుడు మంచి రోడ్ గ్రిప్ ఉండేలా దీని డౌన్‌ఫోర్స్‌ను 24 శాతం పెంచారు.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

మెక్‌లారెన్ పి1 స్టైల్‌లో ఉండే ఈ మెక్‌లారెన్ 650ఎస్ కారులో ఫ్రంట్ బంపర్, గ్రిల్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా పెద్ద సైడ్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఇంప్రూవ్డ్ యాక్టివ్ ఏరో లేదా రియర్ వింగ్ మరియు పీరెల్లీ పి జీరో కోర్సా పెర్ఫార్మెన్స్ టైర్లతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ను ఇందులో గమనించవచ్చు.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

మెక్‌లారెన్ 12సిలో ఉపయోగించిన 3.8 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్‌ను మోడిఫై చేసి, ఈ కొత్త మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కారులో ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 641 హెచ్‌పిల శక్తిని, 678 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెక్‌లారెన్ 12సితో పోల్చుకుంటే దీని పవర్ 25 హెచ్‌లు మరియు టార్క్ 78 ఎన్ఎమ్‌లు అధికం. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

మెక్‌‌లారెన్ 12సితో పోల్చుకుంటే, సస్పెన్షన్ నుంచి బ్రేక్స్ వరకు ఇందులో అనేక యాంత్రికపరమైన మార్పులు ఉన్నాయి. భవిష్యత్తులో 12సి మోడల్‌కి గిరాకీ తగ్గి, ఆ స్థానాన్ని 650ఎస్ భర్తీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

మెక్‌లారెన్ 12సి కన్నా మెక్‌లారెన్ 650ఎస్ మరింత వేగవతంమైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.0 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ వేగాన్ని మరియు 8.4 సెకండ్ల వ్యవధిలోనే 0-201 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

మెక్‌లారెన్ 12సి ఇంటీరియర్స్‌కు మరియు మెక్‌లారెన్ 650ఎస్ ఇంటీరియర్స్‌కు పెద్దగా వ్యత్యాసం కనిపించదు. డ్యాష్‌బోర్డ్ మరియు సీట్లపై కనిపించే ఆల్కాంట్రా ఇందులో కొత్తది. ఇంకా ఇందులో ఐఆర్ఐఎస్ శాటిలైట్ నావిగేషన్ విత్ బ్లూటూత్ టెలిఫోనీ, డిఏబి డిజిటల్ రేడియో వంటి ఫీచర్లున్నాయి.

మెక్‌లారెన్ 650ఎస్ సూపర్‌కార్ ఆవిష్కరణ

ప్రస్తుతం మెక్‌లారెన్ 12సి ధరలు 1.95 లక్షల యూరోల నుంచి 2.15 లక్షల యూరో మధ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మెక్‌లారెన్ 650ఎస్ ధరలు 12సి కన్నా 20,000 యూరోలు అధికంగా ఉండొచ్చని అంచనా. మార్చ్ 3, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో ఈ కారును ఆవిష్కరించనున్నారు.

Most Read Articles

English summary
McLaren has officially revealed the 650S ahead of the Geneva Motor Show. McLaren 650S is supposed to sit as a model between the P1 and the MP4-12C, but its hard to consider it as anything other than the next-gen MP4-12C.
Story first published: Wednesday, February 19, 2014, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X